Joe Root Century Celebration: జో రూట్‌ అజేయ సెంచరీ.. సెలబ్రేషన్స్‌ వీడియో వైరల్‌! అలా ఎందుకు చేసినట్లు?

5 Jul, 2022 17:01 IST|Sakshi
బెయిర్‌ స్టో- జో రూట్‌ ఆత్మీయ ఆలింగనం(PC: ECB)

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ అద్భుతమైన ఆట తీరుతో అభిమానుల మనసు కొల్లగొడుతున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సూపర్‌ ఫామ్‌లోకి వచ్చిన రూట్‌.. న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియాతో రీషెడ్యూల్డ్‌ టెస్టులోనూ అద్భుత సెంచరీతో మెరిశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులకే అవుటైన సిరాజ్‌ బౌలింగ్‌లో అవుటైన రూట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ బౌలింగ్‌లోనే ఫోర్‌ బాది శతకం పూర్తి చేసుకోవడం విశేషం. ఇక సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత కివీస్‌తో సిరీస్‌లో రెండు సెంచరీలు నమోదు చేసిన రూట్‌.. భారత్‌తో మ్యాచ్‌లోనూ శతకం సాధించడం గమనార్హం.

దీంతో రూట్‌ సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్సీ వదిలేసిన తర్వాత బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తానన్న మాట నిలుపుకొన్న రూట్‌.. మరో ఎండ్‌లో ఉన్న బెయిర్‌ స్టోను ఆలింగనం చేసుకుని ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, అతడు పింకీ ఫింగర్‌(చిటికెన వేలు) చూపిస్తూ సెలబ్రేట్‌ చేసుకోవడం సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది. కొంతమంది తన మాట నిలబెట్టుకున్నానని సింబాలిక్‌గా చెప్పాడని అంటుండగా.. మరికొంత మంది మాత్రం ప్రత్యర్థి జట్టును దారుణంగా అవమానించడమే ఇది అంటూ తమకు తెలిసిన అర్థాలు చెబుతున్నారు.

ఇంకొంత మంది తనను విమర్శించిన వాళ్లను ఉద్దేశించే రూట్‌ ఇలా చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా యాషెస్‌ సిరీస్‌ ఓటమి నేపథ్యంలో రూట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. రూట్‌ (142 పరుగులు- నాటౌట్‌), జానీ బెయిర్‌ స్టో(114 పరుగులు - నాటౌట్‌) అద్భుత సెంచరీలతో ఇంగ్లండ్‌ టీమిండియాపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసింది.  

చదవండి: Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ.. సాహసోపేతమైన నిర్ణయం! బహుశా అందుకేనేమో!
Stuart Broad: నోర్ముయ్‌ బ్రాడ్‌.. నన్ను అంపైరింగ్‌ చేసుకోనివ్వు.. నువ్వు బ్యాటింగ్‌ చెయ్‌! వైరల్‌


 

మరిన్ని వార్తలు