IND VS ENG 5th Test: టీమిండియా ఓటమిపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందన

6 Jul, 2022 07:20 IST|Sakshi

గత కొన్ని ఫలితాలు మాకు తీవ్ర నిరాశ కలిగించాయి. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో, ఇక్కడా మాకు మంచి అవకాశాలు లభించాయి. కానీ వాటిని ఉపయోగించుకోలేకపోయాం. బౌలింగ్‌లో ఒకే తరహా  తీవ్రత, ప్రదర్శన, ఫిట్‌నెస్‌ మ్యాచ్‌ ఆసాంతం కొనసాగించలేకపోవడం దానికి కారణమని భావిస్తున్నా. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. తుది జట్టుపై చర్చ సహజం. శార్దుల్‌ బాగానే ఆడుతున్నాడు కాబట్టే మరో అవకాశమిచ్చాం.

అశ్విన్‌ స్థాయి ఆటగాడిని పక్కన పెట్టడం అంత సులువు కాదు. అయితే తొలి రోజు పిచ్‌ చూసినప్పుడు పేసర్లకు అనుకూలిస్తుందని అనిపించింది. మ్యాచ్‌ చివరి వరకు కూడా బంతి పెద్దగా స్పిన్‌ కాలేదు. పిచ్‌లో కూడా పెద్దగా మార్పు రాలేదు కాబట్టి రెండో స్పిన్నర్‌ ఉన్నా ఫలితం మారకపోయేదేమో. తొలి నాలుగు టెస్టుల సమయంలో నేను లేను. అప్పుడు ఇంగ్లండ్‌ కొంచెం ఇబ్బంది పడ్డా, ఇప్పుడు వరుసగా మూడు విజయాల తర్వాత ఇక్కడకు వస్తే, మనం టెస్టులు ఆడి చాలా రోజులైంది. అయినా ఓటమికి సాకులు చెప్పదల్చుకోలేదు. ఇంగ్లండ్‌ కీలక సమయాల్లో బాగా ఆడింది కాబట్టి టెస్టు గెలవగలిగింది. –రాహుల్‌ ద్రవిడ్, భారత్‌ హెడ్‌ కోచ్‌ 

మరిన్ని వార్తలు