India Tour Of England 2022 Schedule: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై.. పూర్తి షెడ్యూల్‌, ‘జట్టు’ వివరాలు!

22 Jun, 2022 11:06 IST|Sakshi
ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమవుతున్న టీమిండియా(PC: BCCI)

India Vs England 2022-  Test, 3 T20, 3 ODI Matches Schedule: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ముగించుకున్న టీమిండియా ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైంది. రీషెడ్యూల్డ్‌ టెస్టు సహా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లు ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జూలై 1 నుంచి ప్రారంభంకానున్న టెస్టు మ్యాచ్‌ కోసం ప్రాక్టీసు మొదలుపెట్టేశారు.

కాగా సోమవారం లీసెస్టర్‌ నగరానికి చేరుకున్న టీమిండియా వారం రోజుల పాటు ఇక్కడే ఉండనుంది. తొలి రోజు ఆటగాళ్లంతా తేలికపాటి డ్రిల్స్, ఫుట్‌బాల్‌కే పరిమితమయ్యారు. అయితే రెండో రోజు మంగళవారం మాత్రం జట్టు పూర్తి స్థాయి ప్రాక్టీస్‌లో పాల్గొంది.

ఇక మంగళవారం ఉదయమే శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్‌తో కలిసి లండన్‌ చేరుకున్న హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వెంటనే లీసెస్టర్‌కు వెళ్లి జట్టుతో చేరాడు. ద్రవిడ్‌ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్లంతా సాధన చేశారు.

టెస్టుకు ముందు గురువారం నుంచి ఇక్కడే లీసెస్టర్‌షైర్‌ కౌంటీతో భారత్‌ నాలుగు రోజుల పూర్తి స్థాయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. టెస్టు తుది జట్టులో స్థానం దక్కే ఆటగాళ్లే ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.    

కాగా గతేడాది కరోనా కలకలం కారణంగా ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య జరగాల్సిన 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కేవలం నాలుగు మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే. ఆఖరి మ్యాచ్‌కు కోవిడ్‌ ఆటంకం కలిగించడంతో ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు పరస్పర ఒప్పందంతో రీషెడ్యూల్‌ చేశాయి.

ఇక ఈ సిరీస్‌లో టీమిండియా  2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం విదితమే. ఈ సిరీస్‌ను అధికారికంగా గెలవాలంటే టీమిండియా ఆఖరి టెస్టును కనీసం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. కాగా గతంలో ఈ సిరీస్‌కు విరాట్‌ కోహ్లి సారథ్యం వహించగా... రోహిత్‌ శర్మ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్‌లకు బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. మరోవైపు ఇంగ్లండ్‌ టీమిండియాతో సిరీస్‌కు ఇంకా జట్లను ప్రకటించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టు నెదర్లాండ్స్‌ పర్యటనలో ఉంది.

ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా షెడ్యూల్‌, టెస్టు జట్టు వివరాలు..
►జూన్‌ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌
►జులై 1- రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ఆరంభం- ఎడ్జ్‌బాస్టన్‌ మైదానం, బర్మింగ్‌హాం
►జులై 1- డెర్బిషైర్‌ వర్సెస్‌ ఇండియా- తొలి టీ20 వార్మప్‌ మ్యాచ్‌
►జులై 3- నార్తాంప్టన్‌షైర్‌ వర్సెస్‌ ఇండియా- రెండో టీ20 వార్మప్‌ మ్యాచ్‌

ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఇండియా: టీ20 సిరీస్‌
►జులై 7- మొదటి టీ20-ది రోజ్‌ బౌల్‌, సౌతాంప్టన్‌
►జులై 9- రెండో టీ20-ఎడ్జ్‌బాస్టన్‌, బర్మింగ్‌హాం
►జులై 10- మూడో టీ20-ట్రెంట్‌బ్రిడ్జి, నాటింగ్‌హాం

ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఇండియా: వన్డే సిరీస్‌
►జులై 12- తొలి వన్డే-కెనింగ్‌టన్‌ నావల్‌, లండన్‌
►జులై 14- రెండో వన్డే-లార్డ్స, లండన్‌
►జులై 17- మూడో వన్డే, ఎమిరేట్స్‌ ఓల్డ్‌ ట్రఫోర్డ్‌, మాంచెస్టర్‌

ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఇండియా: వన్డే సిరీస్‌
►జులై 12- తొలి వన్డే
►జులై 14- రెండో వన్డే
►జులై 17- మూడో వన్డే

ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ (గాయం కారణంగా కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరం).

చదవండి: IND VS ENG: రంగంలోకి దిగిన రాహుల్‌.. రాగానే రుద్దుడు షురూ

మరిన్ని వార్తలు