Asia Cup 2022: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్‌గా!

1 Sep, 2022 12:44 IST|Sakshi

Asia Cup 2022 India Vs Hong Kong- Ravindra Jadeja: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసియా కప్‌ టోర్నీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఆసియా కప్‌-2022లో భాగంగా.. హాంగ్‌ కాంగ్‌తో బుధవారం(ఆగష్టు 31) జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ హయత్‌ వికెట్‌ తీయడం ద్వారా ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పేరిట ఉన్న రికార్డును జడ్డూ బద్దలు కొట్టాడు. 

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జడేజా ఇప్పటి వరకు మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. 2010 నుంచి ఆసియా కప్‌ టోర్నీలో ఆడుతున్న ఈ ఆల్‌రౌండర్‌ తాజాగా సాధించిన ఘనతతో దిగ్గజ బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌, లసిత్‌ మలింగ, అజంతా మెండిస్‌, సయీద్‌ అజ్మల్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌లో జడేజా 4 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. అంతకుముందు పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో 2 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చాడు.

ఆసియా కప్‌ టోర్నీలో 2010 నుంచి 2022లో హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌ వరకు రవీంద్ర జడేజా తీసిన వికెట్లు:
►2010- నాలుగు వికెట్లు
►2012- ఒక వికెట్‌
►2014- ఏడు వికెట్లు
►2016- మూడు వికెట్లు
►2018- ఏడు వికెట్లు
►2022 హాంగ్‌ కాంగ్‌తో మ్యాచ్‌ నాటికి- ఒకటి

ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 ఆటగాళ్లు(ఇప్పటి వరకు)
1. మురళీధరన్‌(శ్రీలంక)- 30
2. లసిత్‌ మలింగ(శ్రీలంక)- 29
3. అజంతా మెండిస్‌(శ్రీలంక)- 26
4. సయీద్‌ అజ్మల్‌(పాకిస్తాన్‌)- 25
5. రవీంద్ర జడేజా(ఇండియా)- 23

చదవండి: Ind Vs HK: కోహ్లికి హాంగ్‌ కాంగ్‌ జట్టు స్పెషల్‌ గిఫ్ట్‌.. థాంక్యూ విరాట్‌ అంటూ! ఫిదా అయిన ‘కింగ్‌’!
Asia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్‌ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్‌ ఫిదా! తలవంచి మరీ! వైరల్‌
IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు