ఐర్లాండ్‌తో రెండో టీ20.. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్‌

20 Aug, 2023 19:07 IST|Sakshi

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రుతురాజ్‌
ఓపెనర్‌ రుతరాజ్‌ గైక్వాడ్‌ 39 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. రుతురాజ్‌కు జతగా రింకూ సింగ్‌ (10) క్రీజ్‌లో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 129/3గా ఉంది. యశస్వి (18), తిలక్‌ వర్మ (1),  సంజూ శాంసన్‌ (40) ఔటయ్యారు. 
 

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా డబ్లిన్‌లోని ద విలేజ్‌ మైదానం వేదికగా ఇవాళ (ఆగస్ట్‌ 20) రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేయనుంది.  తొలి మ్యాచ్‌లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లోనూ  బరిలోకి దిగుతున్నాయి.   

టీమిండియా: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్‌), ఆండ్రూ బల్బిర్నీ, మార్క్ అడైర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్‌ వైట్‌, క్రెయిగ్ యంగ్

మరిన్ని వార్తలు