T20 Format- IND Vs IRE: కేఎల్‌ రాహుల్‌- రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు కొట్టిన చిన్ననాటి స్నేహితులు

29 Jun, 2022 12:58 IST|Sakshi
సంజూ శాంసన్‌- దీపక్‌ హుడా(PC: BCCI)

India Vs Ireland 2nd T20: ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా 2-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది.

కాగా ఈ మ్యాచ్‌ సందర్భంగా దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌ సరికొత్త రికార్డు నమోదు చేశారు. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. డబ్లిన్‌ వేదికగా సాగిన రెండో టీ20తో చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్‌ ఇషాన్‌ కిషన్‌కు జోడీగా బరిలోకి దిగాడు.

ఈ క్రమంలో 42 బంతుల్లో 77(9 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు సాధించాడు. ఇక మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ విఫలం(3) కాగా... వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్‌ హుడా సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 87 బంతుల్లో 176 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తద్వారా కేఎల్‌ రాహుల్‌- రోహిత్‌ శర్మ జోడీ రికార్డును బద్దలు కొట్టారు. దీంతో దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.

టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అత్యధిక స్కోరు భాగస్వామ్యం
దీపక్‌ హుడా- సంజూ శాంసన్‌(2022): ఐర్లాండ్‌పై 176 పరుగులు- డబ్లిన్‌లో..
కేఎల్‌ రాహుల్‌- రోహిత్‌ శర్మ(2017): శ్రీలంకపై 165 పరుగులు- ఇండోర్‌లో.
శిఖర్‌ ధావన్‌- రోహిత్‌ శర్మ(2018): ఐర్లాండ్‌పై 160 పరుగులు- డబ్లిన్‌లో..
శిఖర్‌ ధావన్‌- రోహిత్‌ శర్మ(2017): న్యూజిలాండ్‌పై 158 పరుగులు- ఢిల్లీలో..
కేఎల్‌ రాహుల్‌- రోహిత్‌ శర్మ(2021): అఫ్గనిస్తాన్‌ మీద140 పరుగులు- అబుదాబిలో..

ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌ రెండో టీ20:
టాస్‌: ఇండియా- బ్యాటింగ్‌
ఇండియా స్కోరు: 225/7 (20)
ఐర్లాండ్‌ స్కోరు:  221/5 (20)
విజేత: నాలుగు పరుగుల తేడాతో ఇండియా విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: దీపక్‌ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు)
చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్‌ చేతికి బంతి.. ఈ క్రెడిట్‌ మొత్తం వాళ్లదే!

మరిన్ని వార్తలు