IND VS NZ 1st ODI: హ్యాట్రిక్‌ సిక్సర్లతో డబుల్‌ సెంచరీ పూర్తి చేసిన శుభ్‌మన్‌ గిల్‌ 

18 Jan, 2023 17:21 IST|Sakshi

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిల్‌.. వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గిల్‌ విధ్వంసం ధాటికి భారత్‌ నిర్ణీత ఓవర్లలో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. 

రోహిత్‌ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్‌ (31), హార్ధిక్‌ పాండ్యా (28) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్‌ కోహ్లి (8), ఇషాన్‌ కిషన్‌ (5), వాషింగ్టన్‌ సుందర్‌ (12), శార్దూల్‌ ఠాకూర్‌ (3) నిరాశపరిచారు. కివీస్‌ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్‌ మిచెల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్‌, టిక్నర్‌, సాంట్నర్‌, తలో వికెట్‌ సాధించారు.   

మరిన్ని వార్తలు