డబుల్‌ సెంచరీ ఓకే! టీ20లలో మరీ ఇంత ఘోరమా? అయినా ఇదెక్కడి న్యాయం

28 Jan, 2023 15:57 IST|Sakshi
ఇషాన్‌ కిషన్‌

India vs New Zealand, 1st T20I- Ishan Kishan: బంగ్లాదేశ్‌తో వన్డేలో ద్విశతకం బాది సంచలన రికార్డులు సృష్టించిన టీమిండియా యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషాన్‌ గత కొన్నాళ్లుగా టీ20 ఫార్మాట్‌లో మాత్రం తేలిపోతున్నాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ గత 12 ఇన్నింగ్స్‌ స్కోర్లు పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది.

గత కొన్నాళ్లుగా ఇషాన్‌కు అంతర్జాతీ టీ20లలో ఒక్కటంటే ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు. తాజాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో మొదటి టీ20లోనూ అతడు విఫలమయ్యాడు. రాంచి మ్యాచ్‌లో మరో యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్‌ కిషన్‌ 4 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. సొంత మైదానంలో మిచెల్‌ బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో టీ20లలో అతడి వైఫల్యం మరోసారి బయటపడింది.

డబుల్‌ సెంచరీ ఓకే.. కానీ
ఈ నేపథ్యంలో ఇషాన్‌ కిషన్‌పై విమర్శలు వస్తున్నాయి. ‘‘డబుల్‌ సెంచరీ సంగతి మర్చిపో. ఇకనైనా బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టు. ఇలా అయితే జట్టులో చోటెలా దక్కుతుంది’’ అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదెక్కడి న్యాయం
ఇక కొంత మంది నెటిజన్లు.. సంజూ శాంసన్‌, పృథ్వీ షా పేర్లను ప్రస్తావిస్తూ.. ‘‘సంజూ, పృథ్వీ ఆటలో నిలకడలేదని పక్కన పెడతారు. అదే ఇషాన్‌ మాత్రం ఫెయిల్‌ అవుతున్నా అవకాశాలు ఇస్తారు. ఇదెక్కడి న్యాయం’’ అంటూ బీసీసీఐ సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు.

మరికొంత మందేమో.. ‘‘ఏకంగా రూ. 15 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిన్ను కొన్న ముంబై ఇండియన్స్‌ ఇక తలపై తడిగుడ్డ వేసుకోవాల్సిందే. మరీ ఇంత ఘోరంగా ఆడతావనుకోలేదు ఇషాన్‌’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 

అంతర్జాతీయ టీ20లలో ఇషాన్‌ కిషన్‌ గత 12 ఇన్నింగ్స్‌
►సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో- 26 బంతుల్లో 27 పరుగులు
►సౌతాఫ్రికాపై- 7 బంతుల్లో 15 పరుగులు
►ఐర్లాండ్‌పై- 11 బంతుల్లో 26 పరుగులు
►ఇంగ్లండ్‌పై- 10 బంతుల్లో 8 పరుగులు
►వెస్టిండీస్‌పై- 13 బంతుల్లో 11 పరుగులు
►న్యూజిలాండ్‌పై- 31 బంతుల్లో 36 పరుగులు
►న్యూజిలాండ్‌పై- 11 బంతుల్లో 10 పరుగులు
►శ్రీలంకపై 29 బంతుల్లో 37 పరుగులు
►శ్రీలంకపై- 5 బంతుల్లో 2 పరుగులు
►శ్రీలంకపై- 2 బంతుల్లో 1 పరుగు
►న్యూజిలాండ్‌పై- 5 బంతుల్లో 4 పరుగులు.

చదవండి: Hardik Pandya: మా ఓటమికి ప్రధాన కారణం అదే! అలాంటి ఆటగాడు జట్టులో ఉంటే మాత్రం..
Dinesh Karthik: అలా అయితే వరల్డ్‌కప్‌-2024 టోర్నీలోనూ రోహితే కెప్టెన్‌! లేదంటే..

మరిన్ని వార్తలు