Trolls On Ajinkya Rahane: కెప్టెన్‌ అయ్యి బతికిపోయావు.. లేదంటే

25 Nov, 2021 15:26 IST|Sakshi

Fans Troll Ajinkya Rahane For Batting Failure Vs NZ.. అజింక్యా రహానే బ్యాటర్‌గా మరోసారి ఫెయిలయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రహానే 35 పరుగులు చేసి కైల్‌ జేమిసన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆరంభంలో కాస్త తడబడినా.. తర్వాత ఇన్నింగ్స్‌లో నిలకడ చూపించడంతో రహానే ఈసారి సెంచరీ కొడుతాడని ఆశించారు. కానీ 35 పరుగుల వద్దకు చేరగానే ఇక చాలు అనుకున్నాడేమో.. నిర్లక్ష్యంగా వికెట్‌ ఇచ్చుకోవడం ఆసక్తి కలిగించింది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూరమవడంతో అతని స్థానంలో రహానే సారధ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే బ్యాటర్‌గా రహానే మరోసారి విఫలం కావడంతో సోషల్‌ మీడియాలో వేదికగా క్రికెట్‌ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌ వర్షం కురిపించారు.

''కెప్టెన్‌ అయి బతికిపోయావు.. లేకుంటే ఎప్పుడో పక్కనపెట్టేవారు.. నాకు తెలిసి రహానే తర్వాతి మ్యాచ్‌ ఆడడం కష్టమే.. రహానేకు గడ్డుకాలం నడుస్తుంది.. ఇంకా ఎన్నాళ్లు వెంటాడుతుందో చూడాలి.. పెద్ద స్కోర్‌ చేస్తాడు అన్న ప్రతీసారీ వికెట్‌ ఇచ్చేసుకుంటాడు.. రహానే నుంచి పెద్ద స్కోరు ఆశించడం ఇక వ్యర్థం '' అంటూ కామెంట్స్‌ చేశారు. కాగా ప్రస్తుతం మూడో సెషన్‌ నడుస్తుండగా.. టీమిండియా 68 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌ 50, రవీంద్ర జడేజా 20 పరుగులతో ఆడుతున్నారు. 

చదవండి: India vs New Zealand Test: టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన రచిన్ రవీంద్ర...

మరిన్ని వార్తలు