IND Vs NZ 2nd ODI: హిట్‌మ్యాన్‌ కింద పడబోయాడు.. ఈ వీడియో చూడండి

21 Jan, 2023 19:56 IST|Sakshi

రాయ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా (భారత ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ 4వి బంతి) ఓ యువ అభిమాని మైదానంలోకి ప్రవేశించి రోహిత్‌ శర్మను కౌగిలించుకున్నాడు. వెంటనే అలర్ట్‌ అయిన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని మైదానం నుంచి లాక్కెల్లే క్రమంలో హిట్‌మ్యాన్‌ కిందబోయాడు. హిట్‌మ్యాన్‌ను కౌగిలించుకున్న ఫ్యాన్‌ను దూరం లేగే ప్రయత్నం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటి సిబ్బంది బాలుడిని బలవంతంగా లాక్కెల్తుండగా.. కుర్రాడు.. వదిలేయండి అని హిట్‌మ్యాన్‌ వారికి సూచించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.   

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. మహ్మద్‌ షమీ (3/18), మహ్మద్‌ సిరాజ్‌ (1/10), శార్దూల్‌ ఠాకూర్‌ (1/26), హార్ధిక్‌ పాండ్యా (2/16), కుల్దీప్‌ యాదవ్‌ (1/29), వాషింగ్టన్‌ సుందర్‌ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను 108 పరుగులకు ఆలౌట్‌ చేసింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (36), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (22), మిచెల్‌ సాంట్నర్‌ (27) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (50 బంతుల్లో 51 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 48వ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (53 బంతుల్లో 40 నాటౌట్‌; 6 ఫోర్లు) భీకర ఫామ్‌ను కొనసాగించాడు. వేగంగా మ్యాచ్‌ ముగించే క్రమంలో విరాట్‌ కోహ్లి (9 బంతుల్లో 11; 2 ఫోర్లు) సాంట్నర్‌ బౌలింగ్‌లో స్టంప్‌ ఔటయ్యాడు. కివీస్‌ బౌలర్లలో హెన్రీ షిప్లే, మిచెల్‌ సాంట్నర్‌లకు తలో వికెట్‌ దక్కింది. నామమాత్రమైన మూడో వన్డే ఇండోర్‌ వేదికగా జనవరి 24న జరుగనుంది. 

మరిన్ని వార్తలు