Rohit-Rahane: రోహిత్‌, రహానే.. మనకు తెలియకుండా ఇన్ని పోలికలా!

12 Nov, 2021 18:41 IST|Sakshi

Similarities Between Rohit Sharma And Ajinkya Rahane.. రోహిత్‌ శర్మ, అజింక్యా రహానే.. ఈ ఇద్దరు టీమిండియా సమకాలీన క్రికెట్‌లో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. రోహిత్‌ మూడు ఫార్మాట్లలో ముఖ్యపాత్ర పోషిస్తుంటే.. మరొకరు టెస్టుల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. కోహ్లి అందుబాటులో లేని సమయాల్లో ఈ ఇద్దరు తాత్కాలిక కెప్టెన్లుగా వ్యవహరించారు. గతేడాది ఆసీస్‌ పర్యటనలో విరాట్‌ కోహ్లి తొలి టెస్టు అనంతరం స్వదేశానికి వచ్చేయడంతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రహానే జట్టును విజయవంతంగా నడిపించాడు. 2-1 తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించి టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.

చదవండి: Ravi Shastri: గంగూలీతో విభేదాలు నిజమే.. 

ఇక తాజాగా టి20 ప్రపంచకప్‌ 2021 అనంతరం విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.  దీంతో రోహిత్‌ శ‍ర్మకు టి20 కెప్టెన్‌గా బాధ్యతలు అ‍ప్పజెప్పిన బీసీసీఐ.. కోహ్లి గైర్హాజరీలో కివీస్‌తో తొలి టెస్టుకు రహానేను టెస్టు కెప్టెన్‌గా నియమించింది.  నవంబర్‌ 17 నుంచి మొదలవనున్న సిరీస్‌లో మొదటగా మూడు టి20లు.. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ, రహానే శైలిలో మనకు తెలియని పోలికలు  చాలానే ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

రోహిత్‌, రహానే... ఇద్దరు ముంబై నుంచి వచ్చినవారే

రోహిత్‌ వన్డేల్లో, టి20ల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉంటే... రహానే టెస్టుల్లో వైస్‌కెప్టెన్‌గా ఉన్నాడు.

ముంబైలో ఫేమస్‌ అయిన వడాపావ్‌ అంటే ఈ ఇద్దరికి చాలా ఇష్టమంట

కోహ్లి గైర్హాజరీలో రోహిత్‌, రహానే ప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు( టి20 కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోవడంతో రోహిత్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు)

రోహిత్‌, రహానే ఇద్దరు సియెట్‌ కంపెనీ బ్యాట్‌నే వాడడం విశేషం.

రోహిత్‌ చాలా సందర్భాల్లో కూల్‌గానే ఉంటాడు.. రహానే స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మ్యాచ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టుతో వివాదాలకు పోకుండా కూల్‌గా ఉండడం ఇతని నైజం

చదవండి: Jaydev Unadkat: బ్యాటింగ్‌ వీడియో షేర్‌ చేశాడు.. 'నన్ను ఆల్‌రౌండర్‌గా పరిగణించండి'

మరిన్ని వార్తలు