IND vs NZ: క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు బాధ్యత ఉన్నోడు!

26 Nov, 2021 18:56 IST|Sakshi

IPS officer Asim Arun Cleaning Trash At Green Park Stadium.. ఆసిమ్‌ అరుణ్‌.. అతనొక ఐపీఎస్‌ ఆఫీసర్‌.. క్రికెట్‌ అంటే విపరీతమైన అభిమానం. అందరిలాగే టీమిండియా- న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌ చూడడానికి కాన్పూర్‌ స్టేడియానికి వచ్చాడు. రోజంతా మ్యాచ్‌ ఎంజాయ్‌ చేశాడు. కానీ మ్యాచ్‌ ముగిసిన తర్వాత అందరిలా మాత్రం వెళ్లిపోలేదు. తనో బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నానన్న మాటను గుర్తు చేస్తూ తన కర్తవ్యాన్ని చేసి చూపించాడు. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు తిని పడేసిన ఆహార ప్యాకెట్లు.. వాటర్‌ బాటిల్స్‌తో పాటు చెత్తను సంచిలో పడేసి క్లీన్‌ చేశారు. 

చదవండి: Ravindra Jadeja: క్లీన్‌బౌల్డ్‌‌ అయ్యాడు.. కోపంతో కొట్టాలనుకున్నాడు

ఇదంతా గమనించిన స్టేడియం సిబ్బంది ఐపీఎస్‌ ఆఫీసర్‌ చేసిన పనికి ఫిదా అయ్యారు. తమ కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ఆయన చేసిన పనికి మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆసిమ్‌ అరుణ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ''గ్రీన్‌ సిటీగా మార్చి కాన్పూర్‌ను అందంగా ఉంచాలనేది రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్షించారు. ఆయన  కోరిక మేరకు  ఈరోజు గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచడం సంతోషం కలిగించింది. అంటూ ట్విటర్‌లో ఫోటో షేర్‌ చేసి క్యాప్షన్ జత చేశాడు.  

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రెండోరోజు ఆటలో న్యూజిలాండ్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. తొలుత టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఆ తర్వాత టీమిండియా బౌలర్లకు వికెట్లు దక్కకుండా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, విల్లీ యంగ్‌లు అర్థశతకాలతో మెరిసి తమ జోరు చూపెట్టారు. రెండోరోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్‌ 57 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 129 పరుగులు చేసింది.

చదవండి: Tom Latham: మూడుసార్లు రివ్యూలో సక్సెస్‌.. టెస్టు చరిత్రలో రెండో బ్యాటర్‌గా

మరిన్ని వార్తలు