IND vs NZ: హోటల్‌ రూంకు టీమిండియా ఆటగాళ్లు.. ద్రవిడ్‌ మాత్రం

21 Nov, 2021 11:56 IST|Sakshi

Rahul Dravid Rushes To Eden Gardens Straight From Kolkata Airport.. టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపికైనప్పటి నుంచి పనిలో స్పీడ్‌ పెంచారు. న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా నామమాత్రమైన మూడో టి20కి సిద్ధమైంది. ఆదివారం(నవంబర్‌ 21న) మూడో టి20 మ్యాచ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది.  మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరు పొందిన ద్రవిడ్‌ ఈ మ్యాచ్‌ను కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మ సహా మిగిలిన ఆటగాళ్లంతా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు నుంచి నేరుగా హోటల్‌ రూంకు వెళ్లిపోయారు.

చదవండి: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. 115 ఏళ్ల తర్వాత.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్‌

అయితే ద్రవిడ్‌ మాత్రం ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానానికి చేరుకున్నారు. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌తో కలిసి పిచ్‌ను పరిశీలించిన ద్రవిడ్‌ .. అక్కడి పిచ్‌ క్యూరేటర్‌తో చాలాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక కోచ్‌గా తొలిసారి ఈడెన్‌లో అడుగుపెట్టిన ద్రవిడ్‌కు ఈ స్డేడియంతో మంచి అనుబంధం ఉంది. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లక్ష్మణ్‌తో కలిసి ద్రవిడ్‌ చారిత్రక ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. 281 పరుగులతో లక్ష్మణ్‌ మొమరబుల్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. ద్రవిడ్‌ 180 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలో బెస్ట్‌ మ్యాచ్‌గా నిలిచిపోయింది.

చదవండి: మార్పులతో మూడో మ్యాచ్‌కు...

మరిన్ని వార్తలు