Ashwin-Ajaz Patel: ఎజాజ్‌ పటేల్‌కు అశ్విన్‌ సాయం.. ఫ్యాన్స్‌ ఫిదా

7 Dec, 2021 13:06 IST|Sakshi

Ravichandran Ashwin Helps Ajaz Patel.. టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక బౌలర్‌ ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి. జిమ్‌ లేకర్‌, అనిల్‌ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా ఎజాజ్‌ నిలిచాడు. ఒకవైపు ఎజాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నవేళ .. ఒక విషయంలో టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎజాజ్‌కు సాయపడ్డాడు.

చదవండి: Babar Azam: బాబర్‌ అజమ్‌ హాఫ్‌ సెంచరీ .. పాపం ప్రకృతి సహకరించడం లేదు

ఎజాజ్‌ 10 వికెట్ల ఫీట్ సాధించనంతవరకు అతని పేరు పెద్దగా ఎవరికి పరిచయం లేదు. అతను పేరిట ట్విటర్‌ ఎకౌంట్‌ ఉన్నప్పటికి బ్లూ టిక్‌ మార్క్‌ లేదు. ఈ విషయాన్ని గమనించిన అశ్విన్‌ స్వయంగా రంగంలోకి దిగి ఎజాజ్‌ తరపున ట్విటర్‌కు రిక్వెస్ట్‌ పెట్టాడు. '' డియర్‌ ట్విటర్‌.. టెస్టు చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఎజాజ్‌ నిలిచాడు. అతని అకౌంట్‌ను వెరిఫై చేసి బ్లూ టిక్‌ మార్క్‌ ఇవ్వండి'' అంటూ రాసుకొచ్చాడు.

అశ్విన్‌ పోస్ట్‌కు స్పందించిన ట్విటర్‌ అధికారులు ఎజాజ్‌ను వెరిఫై చేసి బ్లూటిక్‌ మార్క్‌ ఇచ్చారు. ఇది తెలుసుకున్న అశ్విన్‌ తర్వాత ట్విటర్‌కు థ్యాంక్స్‌ చెబుతూ రీట్వీట్‌ చేశాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు 10 వికెట్లు ప్రదర్శన చేసిన ఎజాజ్‌కు అశ్విన్‌ తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ జెర్సీపై టీమిండియా ఆటగాళ్ల సంతకాలు ఉండడం విశేషం. ఇక అశ్విన్‌ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీసిన అశ్విన్‌.. ఓవరాల్‌గా రెండు టెస్టులు కలిపి 14 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

చదవండి: IND vs SA: రహానే, గిల్‌కు షాక్‌.. ఆకాశ్‌ చోప్రా ఫేవరెట్‌ జట్టులో దక్కనిచోటు

>
మరిన్ని వార్తలు