#JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?!

10 Nov, 2021 12:23 IST|Sakshi
PC: Sanju Samson Twitter

Sanju Samson posts a cryptic tweet after being left out of the T20I squad against New Zealand: టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ కారణాల వల్లే ఈ కేరళ బ్యాటర్‌ను పక్కనపెట్టారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2021 టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంజూ.. తనపై వస్తున్న వార్తలకు ట్విటర్‌ వేదికగా దీటుగా బదులిచ్చాడు.

వివిధ సందర్భాల్లో బౌండరీ వద్ద అద్భుత క్యాచ్‌లు అందుకుంటున్న ఫొటోలు షేర్‌ చేసి తన సత్తా ఏమిటో చెప్పాడు. కాగా న్యూజిలాండ్‌తో టీ20, టెస్టు సిరీస్‌ నేపథ్యంలో బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌, హర్షల్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌లకు టీ20 జట్టులో స్థానం కల్పించింది. రాజస్తాన్‌ కెప్టెన్‌ అయిన సంజూ సైతం ఐపీఎల్‌ 2021లో మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

ఈ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లో 484 పరుగులు చేసి ఆరోస్థానంలో నిలిచాడు. అయినప్పటికీ సంజూకి చోటు దక్కకపోవడంతో.. అతడికి న్యాయం చేయాలంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంత మంచి ఆటగాడిని ఎందుకు సెలక్ట్‌ చేయడం లేదో అర్థం కావడం లేదు. మా గుండె పగిలింది. ఐపీఎల్‌లో అత్యుత్తమంగా రాణించినా, దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ఆడుతున్నా ఎందుకు సెలక్ట్‌ చేయడం లేదు’’ అంటూ సెలక్టర్ల తీరును విమర్శిస్తున్నారు.

భారత టి20 జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్, భువనేశ్వర్, దీపక్‌ చహర్, హర్షల్‌ పటేల్, మొహమ్మద్‌ సిరాజ్‌. 

భారత్, న్యూజిలాండ్‌ టి20 సిరీస్‌ షెడ్యూల్‌ 
నవంబర్‌ 17: తొలి మ్యాచ్‌ (జైపూర్‌లో) 
నవంబర్‌ 19: రెండో మ్యాచ్‌ (రాంచీలో) 
నవంబర్‌ 21: మూడో మ్యాచ్‌ (కోల్‌కతాలో) 

చదవండి: Harbhajan Singh: 62 నాటౌట్‌, 70, 79 నాటౌట్‌.. అతడేం పాపం చేశాడు.. ఇంకేం చేస్తే సెలక్ట్‌ చేస్తారు?

Poll
Loading...
మరిన్ని వార్తలు