Ind Vs NZ 1st T20- Mark Chapman: మార్క్‌ చాప్‌మన్‌ అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా

18 Nov, 2021 07:42 IST|Sakshi

Ind Vs Nz T20 Series 2021: Mark Chapman 1st Player Score 50 For 2 Countries: అంతర్జాతీయ టి20ల్లో రెండు దేశాల తరఫున అర్ధ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా చాప్‌మన్‌ నిలిచాడు. 2014లో తన స్వదేశం హాంకాంగ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అతను 2015లో ఒమన్‌పై అజేయంగా 63 పరుగులు చేశాడు. ఆపై చాప్‌మన్‌ న్యూజిలాండ్‌కు వలస వెళ్లాడు. ఇక ప్రస్తుతం కివీస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న చాప్‌మన్‌... బుధవారం టీమిండియాతో మొదటి టీ20 మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో సహచర బ్యాటర్‌ మార్టిన్‌ గప్టిల్‌ చాప్‌మన్‌ దగ్గరకు వచ్చి.. అతడిని అభినందించాడు. కాగా జైపూర్‌ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ సేన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 కెప్టెన్‌గా పూర్తిస్థాయిలో రోహిత్‌ శర్మ పగ్గాలు చేపట్టిన తర్వాత.. హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ మార్గనిర్దేశనంలో భారత్‌ మొదటి గెలుపు అందుకుంది. 

వెంకటేశ్‌ అయ్యర్‌ @ 93  
మధ్యప్రదేశ్‌ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారత్‌ తరఫున టి20లు ఆడిన 93వ ఆటగాడిగా నిలిచిన వెంకటేశ్‌కు కెపె్టన్‌ రోహిత్‌ శర్మ క్యాప్‌ అందించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ప్రదర్శనతో వెంకటేశ్‌కు గుర్తింపు దక్కింది. 2021 సీజన్‌ తొలి దశ పోటీల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కని వెంకటేశ్‌... యూఏఈ లెగ్‌లో 10 మ్యాచ్‌లలో 41.11 సగటు, 4 అర్ధ సెంచరీలతో 370 పరుగులు సాధించాడు.  

చదవండి: Martin Guptil Vs Deepak Chahar: గప్టిల్‌ సీరియస్‌ లుక్‌.. దీపక్‌ చహర్‌ స్టన్నింగ్‌ రియాక్షన్‌

>
మరిన్ని వార్తలు