Ind Vs Sa 2nd Test: సఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా విలవిల

3 Jan, 2022 22:07 IST|Sakshi

Updates:

తొలి రోజు సఫారీలదే
దక్షిణాఫ్రికా సీమర్ల ధాటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి సఫారీలకు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ ఆదిలోనే షాకిచ్చినప్పటికీ.. ఎల్గర్‌(11), పీటర్సన్‌(14) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడి తొలి రోజు ఆటను ముగించారు. టీ విరామం తర్వాత బరిలోకి దిగి 18 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా.. వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. మార్క్రమ్‌(12 బంతుల్లో 7) షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
టీమిండియాను 202 పరుగులకే కట్టడి చేసి బరిలోకి దిగిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో ఓపెనర్‌ మార్క్రమ్‌(12 బంతుల్లో 7) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. షమీ సఫారీలను తొలి దెబ్బ తీశాడు. 4 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్‌ 14/1. క్రీజ్‌లో ఎల్గర్‌(5), పీటర్సన్‌ ఉన్నారు. 

7:33 PM: భీకరమైన సఫారీ పేసర్లను ఎదుర్కొన్న భారత జట్టు అతికష్టం మీద 200 పరుగుల మైలరాయిని క్రాస్‌ చేసింది. రబాడ బౌలింగ్‌లో సిరాజ్‌(1) వెనుదిరగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 202 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్‌ రాహుల్‌(50), అశ్విన్‌(46) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సఫారీ బౌలర్లలో జన్సెన్‌ 4, ఒలీవియర్‌, రబాడ తలో 3 వికెట్లు పడగొట్టారు.

7:22 PM: ధాటిగా ఆడుతున్న అశ్విన్‌(50 బంతుల్లో 46; 6 ఫోర్లు) ఎట్టకేలకు జన్సెన్‌ బౌలింగ్‌లో పీటర్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 187  పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా, సిరాజ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

7:13 PM: రబాడ బౌలింగ్‌లో స్ట్రయిట్‌ షాట్‌ ఆడబోయిన షమీ(12 బంతుల్లో 9; ఫోర్‌).. రిటర్న్‌ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా 185 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌(45 బంతుల్లో 44), బుమ్రా క్రీజ్‌లో ఉన్నారు. 

6:50 PM: సఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఒలీవియర్‌ బౌలింగ్‌లో కీగన్‌ పీటర్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి శార్ధూల్‌ ఠాకూర్‌(0) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. 55 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 157/7. క్రీజ్‌లో అశ్విన్‌(27), షమీ ఉన్నారు. 

6:42 PM: టీ విరామం తర్వాత టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. జన్సెన్‌ బౌలింగ్‌లో రిషబ్‌ పంత్‌(43 బంతుల్లో 17; ఫోర్‌) ఔటయ్యాడు. వెర్రిన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టి పంత్‌ను పెవిలియన్‌కు పంపాడు. 54 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 156/6. క్రీజ్‌లో అశ్విన్‌(22), శార్ధూల్‌ ఠాకూర్‌ ఉన్నారు. 

6:13 PM: టీ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోర్‌ 146/5. రాహుల్‌ వెనుదిరిగిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన అశ్విన్‌(21 బంతుల్లో 24; 4 ఫోర్లు) ధాటిగా ఆడుతుండగా..  పంత్‌(32 బంతుల్లో 13; ఫోర్‌) మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతున్నాడు.

5:47 PM: 116 పరుగుల వద్ద టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. నిలకడగా ఆడుతూ హాఫ్‌ సెంచరీ సాధించిన కేఎల్‌ రాహుల్‌(133 బంతుల్లో 50; 9 ఫోర్లు) మార్కో జన్సెన్‌ బౌలింగ్‌లో రబాడకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 117/5. క్రీజ్‌లో పంత్‌(12), అశ్విన్‌(1) ఉన్నారు.

5: 28 PM:హనుమ విహారి రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 

4: 58 PM: టీమిండియా బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌, హనుమ విహారి ఆచితూచి ఆడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ప్రొటిస్‌ బౌలర్లలో మార్కోకు ఒకటి, సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఒలివర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

4: 45 PM: కేఎల్‌ రాహుల్‌ 24 పరుగులు, హనుమ విహారి 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 67/3.
3: 50 PM:లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు: 53/3

3:29 PM: ప్రొటిస్‌ బౌలర్‌ ఒలివర్‌ టీమిండియాను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. వరుసగా రెండు వికెట్లు కూల్చి తడాఖా చూపించాడు. పుజారాను పెవిలియన్‌కు పంపిన ఒలివర్‌.. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన రహానేను సైతం వెంటనే అవుట్‌ చేశాడు. దీంతో రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. 

3: 19 PM: రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
రెండో టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా టీమిండియా మరో కీలక వికెట్‌ కోల్పోయింది. ఒలివర్‌ బౌలింగ్‌లో ఛతేశ్వర్‌ పుజారా అవుట్‌ అయ్యాడు. 33 బంతులు ఎదుర్కొన్న అతడు 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. భారత్‌ స్కోరు: 49/2.

2: 37 PM తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి వికెట్‌ కోల్పోయింది. మార్కో జాన్‌సెన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ వెరెనెకు క్యాచ్‌ ఇచ్చి మయాంక్‌ అగర్వాల్‌(26) పెవిలియన్‌ చేరాడు. కేఎల్‌ రాహుల్‌, ఛతేశ్వర్‌ పుజారా క్రీజులో ఉన్నారు.

2:30 PM: 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు: 36/0కేఎల్‌ రాహుల్‌(9), మయాంక్‌ అగర్వాల్‌(26) క్రీజులో ఉన్నారు.

1:51 PM ఐదు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 15/0. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ క్రీజులో ఉన్నారు.

1: 03 PM: సఫారీల కంచుకోట సెంచూరియన్‌ను బద్దలు కొట్టి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా రెండో టెస్టుకు సిద్ధమైంది. సీమర్ల బలంతో తొలి టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ.. అనూహ్య రీతిలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక టాస్‌ గెలిచిన రాహుల్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కాగా కోహ్లి స్థానంలో తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.

తుది జట్లు:
భారత్‌:

కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

సౌతాఫ్రికా:
డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్‌సెన్‌, కగిసో రబడ, కేశవ్‌ మహరాజ్‌, డువానే ఒలివర్‌, లుంగి ఎంగిడి.

చదవండి: Rahul Dravid- Virat Kohli: అందుకే కోహ్లి డుమ్మా కొట్టాడన్న హెడ్‌కోచ్‌!

మరిన్ని వార్తలు