IND vs SA 3rd ODI Live Updates: మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం

11 Oct, 2022 12:47 IST|Sakshi

సౌతాఫ్రికాతో స్వదేశంలో మూడో వన్డేలో ధావన్‌ సేన ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
మ్యాచ్‌ స్కోర్లు:
సౌతాఫ్రికా 99 (27.1 ఓవర్లు)
భారత్‌ 105/3 (19.1)

పాపం గిల్‌.. హాఫ్‌ సెంచరీ మిస్‌
విజయానికి మూడు పరుగుల దూరంలో ఉండగా టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ పెవిలియన్‌ చేరాడు. 49 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఇషాన్‌ కిషన్‌ అవుట్‌
ఇషాన్‌ కిషన్‌ రూపంలో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఫోర్టుయిన్‌ బౌలింగ్‌లో క్వింటన్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్‌ నిష్క్రమించాడు. అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
42 పరగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. శిఖర్‌ ధవన్‌ 8 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. గిల్‌కు (30)కు జతగా ఇషాన్‌ కిషన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

విజృంభించిన భారత బౌలర్లు.. 99 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా
మూడో వన్డేలో భారత స్పిన్నర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా 99 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా.. వాషింగ్టన్‌ సుందర్‌, షబాజ్‌ ఆహ్మద్‌, సిరాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ప్రోటీస్‌ బ్యాటర్లలో క్లాసన్‌ 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

94 పరుగులకే ఏడు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో దక్షిణాప్రికా
94 పరుగులకే దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయింది. 34 పరుగులు చేసిన క్లాసన్‌.. షబాజ్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
73 పరుగుల వద్ద దక్షిణాప్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఫెహ్లుక్వాయో.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
66 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన మిల్లర్‌.. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి ఫెహ్లుక్వాయో వచ్చాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
43 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మార్‌క్రమ్‌.. షబాజ్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి మిల్లర్‌ వచ్చాడు.

26 పరుగులకే మూడు వికెట్లు 
26 పరుగులకే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. 3 పరుగులు చేసిన హెండ్రిక్స్‌..  సిరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
25 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మలాన్‌.. సిరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

7 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌
7 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాప్రికా వికెట్‌ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో మలాన్‌(11), హెండ్రిక్స్‌(2) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా
7 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన డికాక్‌.. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రెజా హెండ్రిక్స్‌ వచ్చాడు.

సిరీస్‌ను డిసైడ్‌ చేసే మూడో వన్డేలో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం మూడు మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌కు డేవిడ్‌ మిల్లర్‌ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.


తుది జట్లు:
భారత్‌: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్

దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, జోర్న్ ఫోర్టుయిన్, లుంగి ఎంగిడీ, అన్రిచ్ నోర్ట్జే

ఢిల్లీ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే ఆలస్యంగా ప్రారంభం కానుంది. అరుణ్‌జైట్లీ స్టేడియం ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో..  మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో మధ్యాహ్నం 1:00 గంటకు పడాల్సిన టాస్‌ ఇప్పుడు వాయిదా పడింది.  కాగా 1:30 గంటలకు అంపైర్‌లు పిచ్‌ను పరీశీలించాక ఓ నిర్ణంయం తీసుకోనున్నారని" బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

మరిన్ని వార్తలు