సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్‌ కైవసం

22 Dec, 2023 00:15 IST|Sakshi

సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. సిరీస్‌ కైవసం
నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా సౌతాఫ్రికాను చిత్తు చేసి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. సంజూ శాంసన్‌ సెంచరీతో (108) చెలరేగడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అర్ష్‌దీప్‌ సింగ్‌ 4 వికెట్లతో చెలరేగగా.. సుందర్‌, ఆవేశ్‌ ఖాన్‌ చెరో 2 వికెట్లు, అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
177 పరుగుల వద్ద (33.2వ ఓవర్‌) సౌతాఫ్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. సుందర్‌ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి ముల్దర్‌ (1) ఔటయ్యాడు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
174 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్‌ ఇచ్చి క్లాసెన్‌ (21) ఔటయ్యాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
161 పరుగుల వద్ద (29.4వ ఓవర్‌) సౌతాఫ్రికా నాలుగో వికెట్‌ కోల్పోయింది. అర్షదీప్‌ బౌలింగ్‌లో జార్జీ (81) ఔటయ్యాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
141 పరుగుల వద్ద (25.5వ ఓవర్‌) సౌతాఫ్రికా మూడో వికెట్‌ కోల్పోయింది. సుందర్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌ (36) ఔటయ్యాడు. 

22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్‌ 112/2
ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త తడబడిన సౌతాఫ్రికా ఆ తర్వాత నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగుతుంది. జార్జీ (64) అర్ధసెంచరీ చేసి ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. జార్జీకు జతగా మార్క్రమ్‌ (19) క్రీజ్‌లో ఉన్నాడు. 22 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్‌ 112/2గా ఉంది.  

రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
76 పరుగుల వద్ద (14.4 ఓవర్‌లో) సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ బౌలింగ్‌లో డస్సెన్‌ (2) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

టార్గెట్‌ 297.. తొలి వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 59 పరుగుల వద్ద (8.2వ ఓవర్‌) తొలి వికెట్‌ కోల్పోయింది. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌ (19) ఔటయ్యాడు.  

టార్గెట్‌ 297.. ధాటిగా ఆడుతున్న సౌతాఫ్రికా ఓపెనర్లు
297 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 46/0గా ఉంది. జార్జీ (29), రీజా హెండ్రిక్స్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు.

సంజూ శతకం.. ఆఖర్లో మెరిసిన రింకూ.. సౌతాఫ్రికా టార్గెట్‌ 297
నిర్ణయాత్మక మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (108) తన కెరీర్‌లో తొలి శతకంతో టీమిండియా ఈ స్థాయి స్కోర్‌ చేయడానికి పునాది వేయగా.. ఆఖర్లో రింకూ సింగ్‌ (38) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తిలక్‌ వర్మ (52) సైతం బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ సాధించాడు. 

అక్షర్‌ ఔట్‌
కేవలం ఒక్క పరుగు చేసి అక్షర్‌ పటేల్‌ ఔటయ్యాడు. హెండ్రిక్స్‌ బౌలింగ్‌లో అక్షర్‌ వెనుదిరిగాడు. 47 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 259/6గా ఉంది. రింకూ (24), సుందర్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
108 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద సంజూ శాంసన్‌ ఔటయ్యాడు. విలియమ్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సంజూ పెవిలియన్‌కు చేరాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 249/5గా ఉంది. రింకూ (18), అక్షర్‌ పటేల్‌ (1) క్రీజ్లో ఉన్నారు.

శతక్కొట్టిన సంజూ
టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎట్టకేలకు మూడంకెల స్కోర్‌ను సాధించాడు. సౌతాఫ్రికాతో ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సంజూ 110 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సంజూకు ఇది తొలి సెంచరీ. సంజూ శతకంలో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కఠినమైన పిచ్‌పై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సంజూ అత్యంత కీలకమై ఇన్నింగ్స్‌ ఆడాడు. 44 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 235/4గా ఉంది. సంజూకు జతగా రింకూ (14) క్రీజ్‌లో ఉన్నాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
తిలక్‌ వర్మ (52) హాఫ్‌ సెంచరీ పూర్తయిన వెంటనే ఔటయ్యాడు. ఆది కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డ తిలక్‌ ఆఖరికి తిలక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక అతని బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. 41.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 217/4గా ఉంది. సంజూ (96) జతగా రింకూ సింగ్‌ బరిలోకి దిగాడు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్‌
ఆరంభంలో చాలా నిదానంగా ఆడిన తిలక్‌ వర్మ ఇన్నింగ్స్‌ కొనసాగే కొద్ది వేగం పెంచాడు. తిలక్‌ వన్డేల్లో తన తొలి హాఫ్‌ సెంచరీని 75 బంతుల్లో పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో సంజూ శాంసన్‌ (95) శతకానికి చేరువయ్యాడు. 41 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 216/3గా ఉంది. 

37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 178/3
37 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 178/3గా ఉంది. సంజూ శాంసన్‌ (71), తిలక్‌ వర్మ (39) క్రీజ్‌లో ఉన్నారు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ
చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్‌ అంతర్జాతీయ వన్డేల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 66 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో ఈ ఫీట్‌ను సాధించాడు. సంజూకు జతగా తిలక్‌ వర్మ (8) క్రీజ్‌లో ఉన్నాడు. 28 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 121/3గా ఉంది.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
101 పరుగుల వద్ద (18.5వ ఓవర్‌) టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. ముల్దర్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ (21) ఔటయ్యాడు. శాంసన్‌ (38), తిలక్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

ఆచితూచి ఆడుతున్న శాంసన్‌, రాహుల్‌
49 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు సంజూ శాంసన్‌ (33), కేఎల్‌ రాహుల్‌ (20) ఆచితూచి ఆడుతున్నారు. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 95/2గా ఉంది. 

12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 68/2
12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 68/2గా ఉంది. సంజూ శాంసన్‌ (19), కేఎల్‌ రాహుల్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
49 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసి సాయి సుదర్శన్‌ ఔటయ్యాడు. హెండ్రిక్స్‌ బౌలింగ్‌లో సుదర్శన్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 50/2గా ఉంది. సంజూ శాంసన్‌ (9), కేఎల్‌ రాహుల్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
ఇన్నింగ్స్‌ ఐదవ ఓవర్‌లో సిక్సర​్‌, బౌండరీ బాదిన అనంతరం నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో రజత్‌ పాటిదార్‌ (22) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 4.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 34/1గా ఉంది. సాయి సుదర్శన్‌ (9), సంజూ శాంసన్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 20/0
తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్ల సాయి సుదర్శన్‌ (5), రజత్‌ పాటిదార్‌ (12) నెమ్మదిగా ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 20/0గా ఉంది. 

బ్యాటింగ్‌​కు దిగిన టీమిండియా
పార్ల్‌ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్‌ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టునే కొనసాగిస్తుండగా.. టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా రుతురాజ్‌ ఈ మ్యాచ్‌ నుంచి తప్పుకోగా.. కుల్దీప్‌ యాదవ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో రజత్‌ పాటిదార్‌, వాషింగ్టన్‌ సుం‍దర్‌ బరిలోకి దిగనున్నారు. 

తుది జట్లు:
భారత్‌: సాయి సుదర్శన్, రజత్‌ పాటిదార్‌, తిలక్ వర్మ, కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), రింకూ సింగ్‌, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్‌ సుం‍దర్‌, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్‌), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, లిజాడ్‌ విలియమ్స్‌

>
మరిన్ని వార్తలు