IND vs SA 3rd T20: ఆఖరి టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం

4 Oct, 2022 18:44 IST|Sakshi

అఖరి టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం
ఇండోర్‌ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో 49 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. తద్వారా వైట్‌వాష్‌ నుంచి దక్షిణాఫ్రికా తప్పించుకుంది. 228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి  టీమిండియా 130 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ బ్యాటర్లలో దినేష్‌ కార్తీక్‌(46) పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో  ప్రిటోరియస్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. వైన్‌ పార్నల్‌, ఎంగిడీ, కేశవ్‌ మహారాజ్‌,తలా రెండు వికెట్లు వికెట్‌ సాధించారు. అంతకుముందు దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రోసౌవ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో చాహర్‌, ఉమేశ్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు.

ఓటమి దిశగా భారత్‌..
దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో భారత్‌ ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. 114 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన డికాక్‌.. పార్నల్‌ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
86 పరుగులకే టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. 8 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ప్రిటోరియస్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
78 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో కార్తీక్‌(46) ఔటయ్యాడు.

6 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 64/3
6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. క్రీజులో దినేష్‌ కార్తీక్‌(33), సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
45 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన పంత్‌.. ఎంగిడీ బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
4 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. పార్నల్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 18/2

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోయింది. రబాడా బౌలింగ్‌లో రోహిత్‌ డకౌట్‌ అయ్యాడు. ‍క్రీజులోకి అయ్యర్‌ వచ్చాడు.

సెంచరీతో చెలరేగిన రోసౌవ్.. భారత్‌ టార్గెట్‌ 228 పరుగులు
భారత్‌తో మూడో టీ20లో దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రోసౌవ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు.  రుసో సునామీ ఇన్నింగ్స్‌ ఫలితంగా దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 227 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. రుసోతో పాటు ఓపెనర్‌ డికాక్‌ (68) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో చాహర్‌, ఉమేశ్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు.

15 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌: 166/2
భారత్‌తో మూడో టీ20లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్‌ దిశగా వెళ్తుంది. 16 ఓవర్లకు ప్రోటీస్‌ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. క్రీజులో రుసో(76),స్టబ్స్‌(15) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
120 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. 68 పరుగులతో దూకుడుగా ఆడుతోన్న డికాక్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి స్టబ్స్‌ వచ్చాడు.

11 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌: 114/1
11 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా  ఒక్క వికెట్‌ కోల్పోయి 114 పరుగులు చేసింది. క్రీజులో డికాక్‌(64),రుసో(42) పరుగులతో ఉన్నారు.

8 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌: 68/1
8 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా ఒక్క వికెట్‌ కోల్పోయి 68 పరుగులు చేసింది. క్రీజులో డికాక్‌(38), రుసో(23) ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా
30 పరుగులు వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన  బావుమా.. ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి రుసో వచ్చాడు. 5 ఓవర్లకు ప్రోటీస్‌ స్కోర్‌: 38/1

2 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌: 14/0
2 ఓవర్లు ముగిసే సరి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో డికాక్‌(13), బావుమా(1) పరుగులతో ఉన్నారు.

ఇండోర్‌ వేదికగా నామమాత్రపు మూడో టీ20లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది.

స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ దూరమయ్యారు. అదే విధంగా వీరి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, సిరాజ్‌, ఉమేష్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు.

తుది జట్లు
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా(కెప్టెన్‌), క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), రిలీ రోసౌవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ ఎన్‌గిడి

భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్,, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
 

మరిన్ని వార్తలు