Ind Vs Sa 3rd Test: అవకాశం ఇస్తూనే ఉన్నారు.. భారీ మూల్యం చెల్లించక తప్పదు!

13 Jan, 2022 15:02 IST|Sakshi

Ind Vs Sa 3rd Test: టీమిండియా సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానే మరోసారి విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో భాగంగా కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. 9 బంతులు ఎదుర్కొన్న అతడు రబడ బౌలింగ్‌లో ప్రొటిస్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో కూడా రహానే పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కేవలం 9 పరుగులు చేసి అవుటయ్యాడు.

అప్పుడు కూడా రబడకే దొరికిపోయి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా రహానే 10 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. దీంతో రహానే ఆట తీరుపై విమర్శలు వెల్లుతెత్తుతున్నాయి. ‘‘ఫామ్‌లేమితో సతమతమవుతున్నా ఇంకా రహానేకు అవకాశం ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా బైబై చెప్పండి. భారీ మూల్యం చెల్లించారు. ఇంకా అంటే కష్టం కదా’’ అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా గత 50 టెస్టులలో రహానే ఆట తీరును పరిశీలిస్తే... మొత్తం 89 ఇన్నింగ్స్‌లో 2659 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు పుజారా సైతం మరోసారి నిరాశపరిచాడు. దీంతో #PURANE హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఇద్దరు సీనియర్ల పూర్‌ పర్ఫామెన్స్‌ కొనసాగుతూనే ఉంది అంటూ విరుచుకుపడుతున్నారు.

చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ అరంగేట్రం!.. నా మొదటి ప్రాధాన్యం అదే!

మరిన్ని వార్తలు