omicron- India Tour Of South Africa: టీమిండియా వెళ్లడం ఖాయం... అయితే: బీసీసీఐ

4 Dec, 2021 15:37 IST|Sakshi

Ind Vs SA: BCCI Jay Shah Clarity On India Tour Of South Africa T20Is Later: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలకలం నేపథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌పై సందిగ్దత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు. భారత జట్టు సౌతాఫ్రికా టూర్‌కు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేవలం 3 టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌లు మాత్రమే ఆడతారని, 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తర్వాత నిర్వహిస్తామని పేర్కొన్నారు. కోల్‌కతాలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశం ముగిసిన తర్వాత జై షా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

‘‘మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్తుంది. కానీ 4 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ తర్వాత జరుగుతుంది’’ అని జై షా పేర్కొన్నారు. కాగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ కలకలం నేపథ్యంలో మరో 48 గంటల తర్వాత టీమిండియా- ప్రొటిస్‌ జట్ల సిరీస్‌లకు వేదికను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం జొహన్నస్‌బర్గ్‌, ప్రిటోరియాలో మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఈ రెండు పట్టణాలు ఒమిక్రాన్‌ ప్రధాన కేంద్రమైన గౌటెంగ్‌ ప్రావిన్స్‌లో ఉన్న నేపథ్యంలో ఈ మేరకు వేదికలు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

చదవండి: Ind vs NZ 2nd Test: రికార్డుల అజాజ్‌..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే

మరిన్ని వార్తలు