IND VS SA: ఇండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా.. క్రికెట్‌ అభిమానులకు నిరాశే.. కష్టమే ఇక!

20 Dec, 2021 13:52 IST|Sakshi

India Tour Of South Africa- Omicron: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాల నడుమ టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఐరిని కంట్రీ లాడ్జ్‌లో బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీసు మొదలెట్టేశారు కూడా. ఇక ఇప్పటి వరకు సఫారీ గడ్డపై ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవని భారత జట్టు ఈసారి ఎలాగైనా ఆ లోటును పూరించాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

మరోవైపు.. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన నేపథ్యంలో టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా ఈ సిరీస్‌ను మరింత చాలెంజింగ్‌గా తీసుకున్నాడు. కాబట్టి  ప్రొటిస్‌తో పోరు మరింత రసవత్తరంగా మారనుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అయితే, భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య డిసెంబరు 26 నుంచి ఆరంభం కానున్న తొలి టెస్టును ప్రత్యక్షంగా చూసే భాగ్యం క్రికెట్‌ అభిమానులకు దక్కకపోవచ్చు. 

కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించాలా లేదా అన్న విషయంపై దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైన బోర్డు... కేవలం వీఐపీలను మాత్రమే అనుమతించాలనే యోచనలో ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సిరీస్‌ నేపథ్యంలో ఇప్పటి వరకు టిక్కెట్ల అమ్మకం విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడం చూస్తుంటే అభిమానులకే నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. మరోవైపు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో  ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే దేశవాళీ మ్యాచ్‌లను బోర్డు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: Ashes 2021-22: తదుపరి 3 టెస్టులకు కూడా.. ఇక: ఆస్ట్రేలియా

మరిన్ని వార్తలు