India ODI Captain: దక్షిణాఫ్రికా టూర్‌.. వన్డే కెప్టెన్సీ.. కోహ్లి, రోహిత్‌తో మాట్లాడి.. బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కూడా

8 Dec, 2021 11:55 IST|Sakshi

Ind Vs Sa: Selectors To Discuss ODI Captaincy Matter With Kohli Rohit Sharma reports: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌, టెస్టు సిరీస్‌ గెలిచి జోరు మీదున్న టీమిండియా దక్షిణాఫ్రికాకు పయనం కానుంది. ప్రొటిస్‌ జట్టుతో మూడు టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇక పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌-2021 టోర్నీ ముగిసిన తర్వాత విరాట్‌ కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కివీస్‌తో సిరీస్‌లో టీ20 కెప్టెన్‌గా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టిన తొలి సిరీస్‌ను గెలిచాడు. హిట్‌మ్యాన్‌ సారథ్యంలోని భారత జట్టు 3-0 తేడాతో కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. 

ఇదిలా ఉంటే... వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌, ఆ తర్వాత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ జరుగునున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సారథ్య బాధ్యతలు రోహిత్‌ శర్మకు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. దక్షిణాఫ్రికా టూర్‌ సందర్భంగా ఈ ప్రక్రియ లాంఛనం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు కీలక విషయాలు వెల్లడించాయి. వన్డే కెప్టెన్సీకి సంబంధించిన విషయాన్ని కోహ్లి, రోహిత్‌తో చర్చించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు.. ‘‘ఇది చాలా సున్నితమైన అంశం. టీ20 కెప్టెన్‌గా నియమించబడిన రోహిత్‌ శర్మకు వన్డే సారథ్య బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన ఉంది. అయితే, సెలక్టర్లు ఈ విషయం గురించి కోహ్లితో చర్చించాలనుకుంటున్నారు.  

బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి కూడా మట్లాడాలనుకుంటున్నారు. అదేవిధంగా రోహిత్‌ శర్మతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. తను బ్యాటర్‌గా ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నాడో కూడా తెలుసుకోవాల్సి ఉంది’’ అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు వెళ్లే టెస్టు జట్టును ముందుగా ఎంపిక చేసి, ఆ తర్వాతే వన్డే జట్టు ప్రకటించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: India Tour Of South Africa: టీమిండియాకు భారీ షాక్‌.. నలుగురు ఆటగాళ్లు దూరం!

Poll
Loading...
మరిన్ని వార్తలు