Shardul Thakur: శార్ధూల్‌ పేరు ముందు "ఆ ట్యాగ్‌" వెనుక రహస్యమిదే..!

5 Jan, 2022 18:38 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగిన టీమిండియా పేస‌ర్ శార్ధూల్ ఠాకూర్‌కు సంబంధించిన విషయం ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. శార్ధూల్‌ పేరుకు ముందు "లార్డ్" అనే ట్యా‍గ్‌ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని అభిమానులు ఆరా తీస్తుండగా.. శార్దూలే స్వయంగా "లార్డ్‌ ట్యాగ్‌" వెనుక ఉన్న రహస్యాన్ని బహిర్గతం చేశాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ అనంతరం టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రేతో మాట్లాడుతూ.. సదరు విషయంపై వివరణ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 


అసలు విషయం ఏంటంటే(శార్ధూల్‌ మాటల్లో).. నా పేరుకు ముందు లార్డ్‌ అనే ట్యాగ్‌ ఎవరు పెట్టారో నాకే తెలీదు. గతేడాది(2021) ఆస్ట్రేలియా పర్యటన అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్ సందర్భంగా నా పేరు బాగా పాపులర్‌ అయ్యింది. ఆ సిరీస్‌లో నేను ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాను. అప్ప‌టి నుంచే నా పేరు లార్డ్ శార్ధూల్ ఠాకూర్‌గా మారిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. శార్ధూల్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. 24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 28 పరుగులు చేశాడు.
చదవండి: లంక జట్టుకు ఊహించని షాక్‌.. యువ క్రికెటర్‌ సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు