Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్‌! ఇతర వివరాలు

26 Sep, 2022 15:34 IST|Sakshi

South Africa tour of India, 2022- September- T20, ODI Series: స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య బుధవారం(సెప్టెంబరు 28) నుంచి ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు.

కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం ప్రొటిస్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇక ఈ ఏడాది భారత్‌- సౌతాఫ్రికా మధ్య ఇది మూడో సిరీస్‌. జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లగా.. జూన్‌లో ప్రొటిస్‌ జట్టు భారత్‌లో పర్యటించింది.

ఈ సందర్భంగా జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రిషభ్‌ పంత్‌ సారథ్యంలోని భారత జట్టు 2-2తో సిరీస్‌(వర్షం కారణంగా మరో మ్యాచ్‌ రద్దు)ను సమం చేసింది. ఇదిలా ఉంటే.. తాజా సిరీస్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌, వేదికలు, జట్ల వివరాలు, లైవ్‌ స్ట్రీమింగ్‌ తదితర అంశాలు పరిశీలిద్దాం.

భారత్‌లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటన
భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా పూర్తి షెడ్యూల్‌
టీ20 సిరీస్‌
►మొదటి టీ20: సెప్టెంబరు 28- బుధవారం- గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం- తిరువనంతపురం- కేరళ
►రెండో టీ20: అక్టోబరు 2- ఆదివారం-  బర్సపర క్రికెట్‌ స్టేడియం- గువాహటి- అసోం
►మూడో టీ20: అక్టోబరు 4- మంగళవారం-హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియం- ఇండోర్‌- మధ్యప్రదేశ్‌

మ్యాచ్‌ ఆరంభం సమయం:
అన్ని టీ20 మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభం

వన్డే సిరీస్‌
►తొలి వన్డే: అక్టోబరు 6- గురువారం- భారత రత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్‌ స్టేడియం- లక్నో- ఉత్తరప్రదేశ్‌
►రెండో వన్డే: అక్టోబరు 9- ఆదివారం- జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియం కాంప్లెక్స్‌- రాంచి- జార్ఖండ్‌
►మూడో వన్డే: అక్టోబరు 11- మంగళవారం- అరుణ్‌ జైట్లీ స్టేడియం- ఢిల్లీ

మ్యాచ్‌ సమయం:
అన్ని వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆరంభం

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

వన్డే సిరీస్‌కు ఇంకా జట్టు(వార్తా కథనం రాసే సమయానికి)ను ప్రకటించలేదు. అయితే, టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న కారణంగా ప్రపంచకప్‌ ఈవెంట్‌కు సెలక్ట్‌ అయిన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నారు.

భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు:
వన్డే జట్టు:
తెంబా బవుమా(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, రీజా హెన్రిక్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, జానేమన్‌ మలన్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, అన్రిచ్‌ నోర్జే, వానే పార్నెల్‌, పెహ్లుక్వాయో, డ్వేన్‌ ప్రిటోరియస్‌, కగిసో రబడ, తబ్రేజ్‌ షంసీ.

టీ20 జట్టు:
తెంబా బవుమా(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, రీజా హెన్నిక్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి, అన్రిచ్‌ నోర్జే, వానే పార్నెల్‌, డ్వేన్‌ ప్రిటోరియస్‌, కగిసో రబడ, రీలీ రోసోవ్‌, తబ్రేజ్‌ షంసీ, జోర్న్‌ ఫార్చూన్‌, పెహ్లుక్వాయో, మార్కో జాన్‌సేన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌.

లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..
స్టార్‌ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ‍ప్రసారం.

చదవండి: Ind Vs Aus: జడ్డూ లేకుంటే టీమిండియా బలహీనపడుతుందనుకుంటే.. అతడేమో ఇలా: ఆసీస్‌ కోచ్‌

మరిన్ని వార్తలు