Umran Malik: టీమిండియాకు ఎంపికవుతానని ఆయన ముందే చెప్పారు! ఐపీఎల్‌ కంటే ముందే..

8 Jun, 2022 15:46 IST|Sakshi
ఉమ్రాన్‌ మాలిక్‌(PC: BCCI)

India Vs South Africa 2022 T20 Series: టీమిండియాలో చోటు దక్కడం పట్ల కశ్మీర్‌ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ సంతోషం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్న తన కల నెరవేరిందని, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2021లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో నెట్‌బౌలర్‌గా స్థానం సంపాదించిన ఉమ్రాన్‌ మాలిక్‌.. తుదిజట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

తన స్పీడ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ సన్‌రైజర్స్‌లో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2022లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. క్రీడా, రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నాడు.

ఈ క్రమంలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడనన్ను భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రాక్టీసు సెషన్‌లో భాగంగా ఉమ్రాన్‌ మాలిక్‌ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ‘‘నాకు 2022 పూర్తిస్థాయి ఐపీఎల్‌ సీజన్‌. 14 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు తీశాను. ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచాను. టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలన్న నా కల నెరవేరింది.

మొదటి రోజు ట్రెయినింగ్‌ నుంచే నేను పూర్తి ఉత్సుకతో ఉన్నాను. బాగా బౌలింగ్‌ చేస్తాననే అనుకుంటున్నా. జట్టులో చేరే ముందే నేను ఎంతో మంది ప్రేమకు పాత్రుడినయ్యాను. ఇక్కడ ప్రతి ఒక్కరు నన్ను తమ సోదరుడిలా భావిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

ఇక సన్‌రైజర్స్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌ డేల్‌ స్టెయిన్‌తో అనుబంధం గుర్తు చేసుకుంటూ.. ‘‘జాతీయ జట్టు నుంచి నాకు పిలుపు వచ్చినపుడు ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌ బస్సులో డేల్‌ సర్‌ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు నాకు శుభాకాంక్షలు చెబుతుంటే.. ఆయన మాత్రం.. ‘‘నువ్వు కచ్చితంగా టీమిండియాకు ఎంపికవుతావని ఐపీఎల్‌ ఆరంభానికి ముందే చెప్పాను కదా’’ అని సంతోషం వ్యక్తం చేశారు’’ అని ఉమ్రాన్‌ మాలిక్‌ పేర్కొన్నాడు. 

చదవండి: Mithali Raj: రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్‌... భావోద్వేగ నోట్‌తో వీడ్కోలు
Ind Vs SA: పాం‍డ్యా, సంజూపై ద్రవిడ్‌ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా!

మరిన్ని వార్తలు