WTC Points Table After Ind Vs Eng: శ్రీలంకను చిత్తు చేసిన రోహిత్‌ సేన.. ఎన్నో స్థానంలో ఉందంటే

6 Mar, 2022 19:46 IST|Sakshi

Updated ICC World Test Championship Points Table: ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2021-2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా జయభేరి మోగించింది. తొలుత బ్యాటర్లు.. తర్వాత బౌలర్లు విజృంభించడంతో మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసింది. తొలి మ్యాచ్‌లోనే భారీ విజయం సాధించిన టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు మధురానుభూతిని మిగిల్చింది. ఇక తాజాగా ఇన్నింగ్స్‌ మీద 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ స్థానంలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు.

దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత తొలిసారిగా టెస్టు గెలిచినప్పటికీ రోహిత్‌ సేన ఐదో స్థానానికే పరిమితమైంది. ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌లో అదరగొట్టిన ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా తర్వాతి మూడు స్థానాలు ఆక్రమించాయి. ఇక 2021-23 సీజన్‌కు గానూ ఆసీస్‌ ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడగా నాలుగింట గెలిచి, ఒకటి డ్రా చేసుకుని 52 పాయింట్లు సాధించింది.

టీమిండియా విషయానికొస్తే ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక(ప్రస్తుతం)లతో సిరీస్‌ల నేపథ్యంలోజజ 5 విజయాలు, మూడు పరాజయాలు, రెండు డ్రా చేసుకుంది. తద్వారా 65 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. డిపెండింగ్‌  చాంపియన్‌ న్యూజిలాండ్‌ ఇప్పటి వరకు మూడు సిరీస్‌లు ఆడగా  రెండు మ్యాచ్‌లు గెలిచి, మూడింట ఓడి, ఒకటి డ్రా చేసుకుని ఆరో స్థానంలో కొనసాగుతోంది. 
​చదవండి: Ind Vs Sl- Rohit Sharma: టీమిండియా భారీ విజయం.. రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు!

మరిన్ని వార్తలు