IND Vs SL 2021: సిక్సర్లతో విరుచుకుపడిన హార్ధిక్‌, పృథ్వీ షా, సూర్యకుమార్‌.. 

10 Jul, 2021 08:24 IST|Sakshi

కొలంబో: శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందు జరిగిన రెండో ఇంట్రా స్క్వాడ్‌ ప్రా‍క్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలుత టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌(3 వికెట్లు), యజ్వేంద్ర చహల్‌(2 వికెట్లు) సత్తా చాటగా, శుక్రవారం భారత బ్యాట్స్‌మెన్లు బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయారు. హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, నితీష్ రాణాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి బౌలర్లకు చుక్కలు చూపించారు. వారు రెగ్యులర్‌ మ్యాచ్‌ ఎలా ఆడతారో, అలా సీరియస్‌గా బ్యాటింగ్‌ చేస్తూ.. ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేసింది.

కాగా, నిన్నటి సెషన్‌లో చహల్‌, కుల్దీప్‌తో పాటు నవదీప్‌ సైనీ, దీపక్‌ చహర్‌, చేతన్‌ సకారియాలు కూడా వికెట్లు పడగొట్టారు. నితీష్‌ రాణా, కృష్ణప్ప గౌతమ్‌ల వికెట్లను చహల్‌ తీయగా.. సైనీ, తన ఖాతాలో దేవదత్‌ పడిక్కల్‌, హార్దిక్‌ పాండ్యాల వికెట్లను వేసుకున్నాడు. జట్టు కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ వికెట్‌ను చేతన్‌ సకారియా దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే భారత్‌, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే జులై 13న, జులై 16న రెండో వన్డే, 18న మూడో వన్డే‌ జరుగనున్నాయి. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

భారత జట్టు: శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, హార్దిక్ పాండ్యా, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్, మనీష్‌ పాండే, నితీష్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చహల్‌, రాహుల్‌ చాహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా. 

మరిన్ని వార్తలు