Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్‌, జట్లు, ఇతర వివరాలు

2 Jan, 2023 13:53 IST|Sakshi
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- లంక సారథి దసున్‌ (ఫైల్‌ ఫొటో: SL Cricket Twitter)

Sri Lanka Tour of India 2023: శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో టీమిండియా కొత్త సంవత్సరం ఆరంభించనుంది. మంగళవారం (జనవరి 3) లంకతో టీ20 మ్యాచ్‌తో 2023 ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ సిరీస్‌లలో భాగంగా మొత్తంగా మూడు టీ20, మూడు వన్డేల్లో స్వదేశంలో తలపడనుంది. 

ఈ నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌, ఇరు జట్ల వివరాలు, వేదికలు, మ్యాచ్‌ ఆరంభ సమయం, ప్రత్యక్ష ప్రసారం.. తదితర అంశాలు గమనిద్దాం.
ఇండియా వర్సెస్‌ శ్రీలంక టీ20 సిరీస్‌ 2023
మూడు టీ20లు
►మొదటి టీ20: జనవరి 3, మంగళవారం- వాంఖడే స్టేడియం, ముంబై
►రెండో టీ20: జనవరి 5, గురువారం- మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, పుణె
►మూడో టీ20: జనవరి 7, శనివారం- సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, రాజ్‌కోట్‌
►మ్యాచ్‌ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం.. రాత్రి ఏడు గంటలకు ప్రారంభం

ఇండియా వర్సెస్‌ శ్రీలంక వన్డే సిరీస్‌ 2023
మూడు వన్డేలు
►తొలి వన్డే: జనవరి 10, మంగళవారం- బర్సాపర క్రికెట్‌ స్టేడియం, గువాహటి
►రెండో వన్డే: జనవరి 12, గురువారం- ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా
►మూడో వన్డే: జనవరి 15, ఆదివారం- గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం, తిరువనంతపురం
►మ్యాచ్‌ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం

లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
►ఇండియా వర్సెస్‌ శ్రీలంక 2023 సిరీస్‌ల మ్యాచ్‌లు స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షప్రసారం
►స్టార్‌ స్పోర్ట్స్‌ 1, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 హిందీ, స్టార్‌ స్పోర్ట్స్‌ 1 తెలుగు తదితర చానెళ్లలో వీక్షించవచ్చు.
►డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్షప్రసారం.

టీమిండియా
టి20 జట్టు: హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, రుతురాజ్ గై​క్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, సంజు శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్, మావి, ముకేశ్‌ కుమార్‌. 

వన్డే జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్ అయ్యర్‌, రాహుల్, ఇషాన్‌ కిషన్, సుందర్, చహల్, కుల్దీప్, అక్షర్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, అర్ష్‌దీప్‌ సింగ్‌

శ్రీలంక
దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, కుశాల్ మెండిస్ (వన్డేలకు వైస్‌ కెప్టెన్‌), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ (టీ20 వైస్‌ కెప్టెన్‌), ఆషేన్‌ బండార, మహీశ్‌ తీక్షణ, జెఫ్రీ వాండర్సే (వన్డేలకు మాత్రమే), చమికా కరుణరత్నే, దిల్షాన్ మధుశంక, కసున్ రజిత, నువానీదు ఫెర్నాండో (వన్డేలకు మాత్రమే), దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లాహిరు కుమార, నువాన్ తుషార (టీ20లకు మాత్రమే).

చదవండి: BBL: సంచలన క్యాచ్‌.. బిక్క ముఖం వేసిన బ్యాటర్‌! ఇంతకీ అది సిక్సరా? అవుటా?
BCCI: కీలక టోర్నీల్లో వైఫల్యాలు.. భారీ మూల్యం! ఇక ఆటగాళ్లకు కఠిన పరీక్ష.. ఏమిటీ ‘యో–యో’ టెస్టు?

మరిన్ని వార్తలు