IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్‌! కానీ పాపం..

12 Jan, 2023 15:55 IST|Sakshi

India vs Sri Lanka, 2nd ODI- Nuwanidu Fernando: శ్రీలంక యువ ఆటగాడు నువానీడు ఫెర్నాండో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా భారత్‌తో జరుగతున్న వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఫెర్నాండో.. అర్ధ శతకంతో అందరిని ఆకట్టుకున్నాడు. వెన్ను నొప్పి కారణంగా పాతుమ్‌ నిసాంక దూరం కావడంతో అతడి స్థానంలో నువానీడు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

ఈ మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన ఫెర్నాండో దురదృష్టవశాత్తు రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 బౌండరీలు ఉన్నాయి. కాగా వన్డే డెబ్యు మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ సాధించిన ఆరో శ్రీలంక బ్యాటర్‌గా నువానీడు రికార్డులకెక్కాడు. ఇ‍క తొలి మ్యాచ్‌లోనే అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన ఫెర్నాండో గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ నువానీడు ఫెర్నాండో?
ఫెర్నాండో అక్టోబర్ 13, 1999న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. అతడు 2016లో కోలంబో తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. అదే విధంగా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఆకట్టుకున్న ఫెర్నాండోకు 2018 అండర్-19 ప్రపంచకప్‌ శ్రీలంక జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన 132 పరుగులతో రాణించాడు.

అనంతరం 2019లో లిస్ట్‌-ఏ క్రికెట్‌లోకి నువానీడు ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 31 మ్యాచ్‌లు ఆడిన అతడు 1771 పరుగులు సాధించాడు. అదే విధంగా 23 లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 748 పరుగులు, 34 టీ20ల్లో 760 పరుగులు చేశాడు. కాగా లంక సీనియర్‌ పేసర్‌ విశ్వ ఫెర్నాండో సోదరుడే ఈ నువానీడు ఫెర్నాండో కావడం విశేషం.

లంక ప్రీమియర్‌ లీగ్‌లో అదుర్స్‌
గతేడాది ఆఖరిలో జరిగిన లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఫెర్నాండో అదరగొట్టాడు. గాలే గ్లాడియేటర్స్ తరపున ఆడిన అతడు తొమ్మిది మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేశాడు.  ఈ క్రమంలోనే  భారత్‌తో వన్డేలకు శ్రీలంక జట్టులో ఫెర్నాండోకు  చోటు దక్కింది.
చదవండి: Prithvi Shaw: నాకు తల పొగరా? హర్ట్‌ అయ్యాను! పర్లేదు.. పంత్‌​ స్థానంలో నువ్వే! జై షా ట్వీట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు