IND VS SL 2nd ODI: టాస్‌ ఓడిన టీమిండియా, ఒక్క మార్పుతో బరిలోకి..!

12 Jan, 2023 13:26 IST|Sakshi

కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్‌ ఓడి, తొలుత బౌలింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఓ మార్పు చేసింది. తొలి వన్డేలో  ఫీల్డింగ్‌ చేస్తున్న సందర్భంగా గాయపడ్డ చహల్‌ మ్యాచ్‌ సమయానికి కోలుకోక పోవడంతో అతని స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు శ్రీలంక  రెండు మార్పులతో బరిలోకి దిగింది. పథుమ్‌ నిస్సంక, మధుశంక స్థానాల్లో నువనిదు ఫెర్నాండో, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు. 

కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసిం‍ది. కోహ్లి (113) సెంచరీతో, రోహిత్‌ శర్మ (83), శుభ్‌మన్‌ గిల్‌ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్‌) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

తుది జట్లు..

భారత్‌: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్

శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత 

మరిన్ని వార్తలు