Ind Vs SL: టాప్‌-5లో వీళ్లే! భువీ అగ్రస్థానానికి ఎసరు పెట్టిన చహల్‌! అదే జరిగితే..

3 Jan, 2023 14:47 IST|Sakshi
చహల్‌- భువీ

India Vs Sri Lanka 1st T20: టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ అరుదైన ఘనతకు చేరువయ్యాడు. శ్రీలంకతో మంగళవారం మొదలు కానున్న టీ20 సిరీస్‌ నేపథ్యంలో అతడిని ఓ రికార్డు ఊరిస్తోంది. తొలి టీ20 తుదిజట్టులో చహల్‌కు చోటు ఖాయంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో అతడు వాంఖడే మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీస్తే.. తోటి బౌలర్‌, టీమిండియా సీనియర్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రికార్డు బద్దలు కొట్టే వీలుంది. కాగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్‌గా భువీ కొనసాగుతున్నాడు.

భువీ రికార్డు బద్దలు!
ఇప్పటి వరకు మొత్తంగా పొట్టి క్రికెట్‌లో పేసర్‌ భువీ ఆడిన 87 మ్యాచ్‌లలో 90 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. స్పిన్నర్‌ చహల్‌.. 71 మ్యాచ్‌లలో 87 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో స్వదేశంలో సిరీస్‌కు భువీని సెలక్టర్లు పక్కనపెట్టగా.. చహల్‌కు మాత్రం జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో రాణిస్తే చహల్‌.. భువీ పేరిట ఉన్న రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

టాప్‌-5లో ఉన్నది వీళ్లే
కాగా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో పాండ్యా టాప్‌-5లో ఉండటం విశేషం. భువీ 90, చహల్‌ 87, అశ్విన్‌ 72, జస్‌ప్రీత్‌ బుమ్రా 70 వికెట్లతో ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

చదవండి: Ind Vs SL: రుతురాజ్‌, ఉమ్రాన్‌కు నో ఛాన్స్‌.. గిల్‌ అరంగేట్రం!
Jaydev Unadkat: టీమిండియా ప్లేయర్‌ సంచలనం.. .. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్‌గా

మరిన్ని వార్తలు