లంక క్రికెటర్‌కు అపురూపమైన కానుక అందించిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌

26 Jul, 2021 22:13 IST|Sakshi

కొలంబో: భారత్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.  శ్రీలంక కోచ్ మికీ అర్థర్ అతడిని ‘ఫైండ్ ఆఫ్ ది సిరీస్’గా అభివర్ణించాడు. భారత్‌తో నిన్న జరిగిన తొలి టీ20లో శ్రీలంక ఓడినప్పటికీ కరుణరత్నేకు మాత్రం నిన్నటి రోజు గొప్ప మధురానుభూతిగా మిగిలిపోనుంది. తాను రోల్‌మోడల్‌గా భావించే హార్దిక్ పాండ్యా నుంచి బ్యాట్‌ను గిఫ్ట్‌గా అందుకోవడమే ఇందుకు కారణం.

A post shared by Chamika Karunaratne (@chamikakarunaratne)

హార్దిక్ నుంచి బ్యాట్ అందుకున్న అనంతరం కరుణరత్నే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోను పోస్టు చేశాడు. అరంగేట్ర టీ20లో రోల్ మోడల్ హార్దిక్ పాండ్యా నుంచి బ్యాట్‌ను అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ రోజును తానెప్పటికీ మర్చిపోలేనని, హార్దిక్‌ను భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షించాడు. కరుణరత్నే శ్రీలంక తరపున ఇప్పటి వరకు ఓ టెస్టు, ఏడు వన్డేలు, టీ20 ఆడాడు. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో కరుణరత్నే 8వ స్థానంలో బరిలోకి దిగి 35 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, నిన్నటి తొలి టీ20లో ధవన్‌ సేన శ్రీలంకపై 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు