Virat Kohli 100th Test: మరో 38 పరుగులు.. దిగ్గజాల సరసన

2 Mar, 2022 12:02 IST|Sakshi

టీమిండియా మెషిన్‌ గన్‌ విరాట్‌ కోహ్లి వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో ప్రత్యేకత సంతరించుకుంది. టీమిండియా తరపున టెస్టుల్లో వందో టెస్టు ఆడనున్న 12వ ఆటగాడిగా నిలవనున్నాడు. కోహ్లి ప్రతిష్టాత్మక టెస్టుకు ప్రేక్షకులను అనుమతించేది లేదని బీసీసీఐ పేర్కొంది. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో బీసీసీఐ వెనక్కి తగ్గి మొహలీ టెస్టుకు 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. కోహ్లి వందో టెస్టును దగ్గరుండి చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరనుంది.

ఈ విషయం పక్కనబెడితే తన వందో టెస్టులో కోహ్లిని ఒక రికార్డు ఊరిస్తుంది. ప్రస్తుతం కోహ్లి 99 టెస్టుల్లో 7,962 పరుగులు సాధించాడు. మొహలీ టెస్టులో కోహ్లి 38 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్‌లో 8వేల పరుగుల మార్క్‌ను అందుకోనున్నాడు. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరపున 8వేల పరుగులు పూర్తి చేసిన ఆరో ఆటగాడిగా కోహ్లి నిలవనున్నాడు. సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సునీల్‌ గావస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, వివిఎస్‌ లక్ష్మణ్‌ సరసన కోహ్లి చేరనున్నాడు. 8వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్‌కు 154 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్‌ ద్రవిడ్‌(158 ఇన్నింగ్స్‌లు), వీరేంద్ర సెహ్వాగ్‌(160 ఇన్నింగ్స్‌లు), సునీల్‌ గావస్కర్‌(166 ఇన్నింగ్స్‌లు), వివిఎస్‌ లక్ష్మణ్‌(201 ఇన్నింగ్స్‌లు) అవసరమయ్యాయి.

చదవండి: ‘వంద’లు లెక్కించడం కొత్త కాదు..కోహ్లికి ఈ ‘వంద’ మాత్రం ప్రత్యేకమైందే

IPL 2022: 'ధావన్‌తో ఓపెనింగ్‌ చేసే అవకాశం రావడం నా అదృష్టం'

Virat Kohli 100th Test: కోహ్లి ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎట్టకేలకు కనికరించిన బీసీసీఐ

మరిన్ని వార్తలు