IND VS WI 4th T20: అఫ్రిదిని అధిగమించి, క్రిస్‌ గేల్‌కు చేరువైన హిట్‌మ్యాన్‌

6 Aug, 2022 21:57 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో ప్రపంచ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో హిట్‌మ్యాన్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. విండీస్‌తో నాలుగో టీ20లో మూడు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్‌.. అన్ని ఫార్మాట్లలో సిక్సర్ల సంఖ్యను 477కు పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతను పాక్‌ మాజీ పవర్‌ హిట్టర్‌ షాహిద్‌ అఫ్రిదిని (476 సిక్సర్లు) అధిగమించాడు. ఈ జాబితాలో విండీస్‌ విధ్వంసకర యోధుడు, యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌ మొత్తంలో 553 సిక్సర్లు బాదిన గేల్‌ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదై ఉంది. 

ఇదిలా ఉంటే, విండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (14 బంతుల్లో 24; ఫోర్‌, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌కు మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ.. స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్‌ 96/2గా ఉంది. దీపక్‌ హుడా (15 బంతుల్లో 19), రిషబ్‌ పంత్‌ (15 బంతుల్లో 16) క్రీజ్‌లో ఉన్నారు. 
చదవండి: టీమిండియాకు భారీ షాక్... గాయంతో స్టార్‌ బౌలర్‌ ఔట్‌..!

మరిన్ని వార్తలు