IND VS WI 5th T20: రోహిత్‌కు రెస్ట్‌.. కెప్టెన్‌గా హార్ధిక్‌.. మరో కొత్త ఓపెనింగ్‌ జోడీతో ప్రయోగం

7 Aug, 2022 20:50 IST|Sakshi

అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్ జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా భారీ ప్రయోగాలకు పూనుకుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ ఇదివరకే 3-1తో కైవసం చేసుకోవడంతో జట్టు యాజమాన్యం ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నామమాత్రంగా జరిగే ఈ మ్యాచ్‌ కోసం రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు రెస్ట్‌ ఇచ్చిన మేనేజ్‌మెంట్‌.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పజెప్పింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా మొత్తం నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్‌లకు విశ్రాంతినివ్వడంతో హార్ధిక్‌ పాండ్యా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. టాస్ గెలిచిన హార్దిక్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో కొత్త ఓపెనింగ్‌ జోడీని ప్రయోగించింది.

ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 11; ఫోర్‌) ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌లోనే పెవిలియన్‌ బాట పట్టడంతో ఈ జోడీకి బ్రేక్‌ పడింది. అయితే మరో ఓపెనర్‌ శ్రేయస్‌ మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. 9 ఓవర్లు ముగిసే సమయానికి భారత స్కోర్‌ 86/1గా ఉంది. శ్రేయస్‌ 27 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 47 పరుగుల వద్ద అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో దీపక్‌ హూడా (16 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్‌) సైతం బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు.   

భారత్‌: హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్‌, దీపక్‌ హూడా, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్ యాదవ్, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌, అర్షదీప్‌ సింగ్‌ 

వెస్టిండీస్: షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, నికోలస్ పూరన్ ( కెప్టెన్ ), డెవాన్ థామస్ ( వికెట్ కీపర్ ), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, కీమో పాల్, డొమినిక్ డ్రేక్స్, ఒబెడ్ మెక్‌కాయ్, హేడెన్ వాల్ష్, రోవ్‌మన్ పావెల్
చదవండి: సూర్యకుమార్‌కు విశ్రాంతి.. ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌!

మరిన్ని వార్తలు