Ind Vs Wi 2nd ODI: అదే ఆఖరు... 19 ఏళ్లకు పైగానే అయింది గెలిచి.. ఈసారి కూడా!

9 Feb, 2022 11:36 IST|Sakshi

Ind Vs Wi ODI Series 2022- చారిత్రాత్మక 1000వ వన్డేలో వెస్టిండీస్‌పై అద్భుత విజయం అందుకున్న టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు భారత్‌లో  మరోవన్డే సిరీస్‌ పరాజయాన్ని తప్పించుకోవాలని వెస్టిండీస్‌ భావిస్తోంది. ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే రోహిత్‌ సేనదే పైచేయిగా కనిపిస్తోంది. 

తొలి వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రతిభతో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన నేపథ్యంలో టీమిండియాకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుధవారం నాటి మ్యాచ్‌లో పొలార్డ్‌ సేనకు మరోసారి పరాభవం తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత గడ్డపై విండీస్‌ వన్డే సిరీస్‌ల పరాజయ పరంపర రికార్డును పరిశీలిద్దాం.

ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ వన్డే రికార్డులు:
19 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా విండీస్‌ భారత్‌లో టీమిండియాను ఓడించలేకపోయింది.
2002 సిరీస్‌లో 7 మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్డిండీస్‌ 4-3 తేడాతో గెలుపొందింది. భారత్‌లో విండీస్‌కు ఇదే ఆఖరి విజయం.
ఆ తర్వాత వరుసగా ఏడు వన్డే సిరీస్‌లో భారత్‌ చేతిలో విండీస్‌ ఓటమి పాలైంది.
2007లో టీమిండియా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్‌పై 3-1 తేడాతో గెలుపొందింది.
2011లో భారత్‌ విండీస్‌ను 4-1 తేడాతో చిత్తుగా ఓడించింది.
2013లో విండీస్‌పై 2-1తేడాతో టీమిండియా నెగ్గింది.
2014లో భారత జట్టు మరోసారి 2-1 తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.
2018లో భారత్‌ 3-1 తేడాతో విండీస్‌ను ఓడించి సిరీస్‌ గెలిచింది.
2019లో విండీస్‌ టీమిండియా చేతిలో 2-1 తేడాతో పరాజయం పాలై వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది.
2022లో భాగంగా భారత్‌తో తొలి వన్డేలో వెస్టిండీస్‌ ఓడిపోయింది. 

చదవండి: IPL 2022 Mega Auction: అప్పుడు 1.5 కోట్లు.. ఇప్పుడు అత‌డి కోసం యుద్దం జ‌ర‌గ‌నుంది.. రికార్డులు బ‌ద్ద‌లు అవ్వాల్సిందే!

మరిన్ని వార్తలు