IND Vs ZIM: జింబాబ్వేతో తొలి వన్డే.. టీమిండియా రికార్డుల మోత

18 Aug, 2022 18:58 IST|Sakshi

జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. గురువారం హరారే వేదికగా జరిగిన వన్డేలో కేఎల్‌ రాహుల్‌ సేన జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

►టీమిండియా ఓపెనర్లు ధావన్‌, శుబ్‌మన్‌ గిల్‌ కొత్త చరిత్ర సృష్టించారు. 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సందర్భాల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జాబితాలో వీరిద్దరు రెండో స్థానంలో ఉన్నారు. ఇక తొలి స్థానంలో జింబాబ్వేపైనే 1998లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 197/0 పరుగులు తొలి స్థానం. ఆ తర్వాత మరోసారి జింబాబ్వేపై 2016లో 126/0.. మూడో స్థానంలో ఉంది. 

►ఇక టీమిండియాకు వన్డేల్లో 200 కంటే లక్ష్య ఛేదనల్లో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా విజయం అందుకోవడం ఇది ఎనిమిదో సారి.

► జింబాబ్వేపై భారత్‌కు ఇది వరుసగా 13వ వన్డే విజయం(2013-22 మధ్య కాలంలో). ఇంతకముందు బంగ్లాదేశ్‌పై 12 విజయాలు(1998-2004), న్యూజిలాండ్‌పై 11 విజయాలు(1986-88), 10 విజయాలు(2002-05) మరోసారి జింబాబ్వేపైనే సాధించింది. 

చదవండి: IND vs ZIM 1st ODI: ధావన్‌, గిల్‌ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం


 

మరిన్ని వార్తలు