Ind Vs Zim ODI 2022: జింబాబ్వే పర్యటనలో టీమిండియా.. పూర్తి షెడ్యూల్‌, జట్ల వివరాలు.. తాజా అప్‌డేట్లు!

16 Aug, 2022 17:41 IST|Sakshi

India Vs Zimbabwe ODI Series: స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌ల కంటే ముందు టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న కేఎల్‌ రాహుల్‌ సేన మూడు వన్డేలు ఆడనుంది. భారత క్రికెట్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ మార్గదర్శనంలో ‘పసికూన’తో పోరుకు సిద్ధమవుతోంది. కాగా ఆసియా కప్‌-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి సహా పలువురు కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. 

దీంతో తొలుత వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను తొలుత ఈ జట్టుకు సారథిగా ఎంపిక చేశారు. అయితే, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం నుంచి కోలుకోవడంతో ధావన్‌ను తప్పించి అతడికి కెప్టెన్సీ అప్పగించారు. ఇక గాయం కారణంగా వాషింగ్టన్‌ సుందర్‌ దూరం కావడంతో అతడి స్థానాన్ని షాబాజ్‌ అహ్మద్‌తో భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం వెల్లడించింది.

మరోవైపు.. బంగ్లాదేశ్‌ను స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లలో 2-1తో ఓడించి జింబాబ్వే ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే, రెగ్యులర్‌ కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో చకబ్వా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

మరి టీమిండియా జింబాబ్వే టూర్‌ నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌, మ్యాచ్‌ ప్రసార సమయం, వేదిక, ఇరు జట్ల వివరాలు తదితర అంశాలు గమనిద్దాం.

జింబాబ్వే వర్సెస్‌ భారత్‌ వన్డే సిరీస్‌- మూడు మ్యాచ్‌లు
షెడ్యూల్‌-వేదిక
►మొదటి వన్డే- ఆగష్టు 18- గురువారం- హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌, హరారే
►రెండో వన్డే- ఆగష్టు 20- శనివారం-హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌, హరారే
►మూడో వన్డే- ఆగష్టు 22- సోమవారం- హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌, హరారే

మ్యాచ్‌ ప్రసార సమయం
►భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.45 గంటలకు టీమిండియా- జింబాబ్వే మధ్య వన్డే మ్యాచ్‌లు ఆరంభం

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే!
►భారత్‌లో సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో లైవ్‌ టెలికాస్ట్‌. సోనీలివ్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌.
►జింబాబ్వేలో సూపర్‌స్పోర్ట్‌ టీవీలో ప్రసారం.

జింబాబ్వే పర్యటనలో భారత జట్టు:
►కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా, షాబాజ్‌ అహ్మద్‌, అక్షర్‌ పటేల్‌, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆవేశ్‌ ఖాన్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, దీపక్‌ చహర్‌.

జింబాబ్వే జట్టు:
రెగిస్ చకబ్వా (కెప్టెన్‌), తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ర్యాన్ బర్ల్, ఇన్నోసెంట్ కైయా, కైటానో టకుడ్జ్వానాషే, క్లైవ్ మడాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమని, జాన్ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్‌టర్ న్గార్వా, సికిందర్‌ రజా, మిల్టన్ షుంబా, డోనాల్డ్ తిరిపానో, విక్టర్‌ నయౌచి. 

చదవండి: IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త
Kevin Obrien: ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించి.. పాకిస్తాన్‌పై సెంచరీతో మెరిసి! కెవిన్‌ అరుదైన ఘనతలు!

మరిన్ని వార్తలు