ICC Women's World Cup: ప్రపంచకప్‌లో భారత్‌ బోణి.. పాకిస్తాన్‌కు చుక్కలు..

6 Mar, 2022 13:48 IST|Sakshi

Ind W Vs Pak W 2022 World Cup: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2022లో భారత్‌ బోణి కొట్టింది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. కాగా పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. ఇక 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ బ్యాటర్లలో సిద్రా అమీన్(30) తప్ప మిగితా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్‌ మూడు వికెట్లు పడగొట్టగా, గోస్వామి, స్నేహ్‌ రానా చెరో రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు సాదించింది. భారత బ్యాటర్లలో పూజా వస్త్రాకర్‌ అద్భుతంగా రాణించింది.

ఇక 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ను పూజా వస్త్రాకర్‌(67),స్నేహ్‌ రానా(53) అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ మిథాలీ, హర్మన్‌ ప్రీత్‌, షఫాలీ వర్మ నిరాశపరిచాడు. పాక్‌ బౌలర్లలో నిదా ధార్‌,సంధు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బేగ్‌, ఆమీన్‌ ఒక్కో వికెట్‌ సాధించారు. ఇక ఈమ్యాచ్‌లో 67 పరుగులతో అద్భుతంగా రాణించిన పూజా వస్త్రాకర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మార్చి10న తలపడనుంది.

చదవండి: Shane Warne: శవపరీక్షకు వార్న్‌ మృతదేహం.. బోరుమన్న దిగ్గజం కుమారుడు

మరిన్ని వార్తలు