Independence Day 2022: భారతీయుడినైనందుకు గర్విస్తున్నా.. జై హింద్‌! క్రికెటర్ల శుభాకాంక్షలు

15 Aug, 2022 12:00 IST|Sakshi
భార్య అనుష్క శర్మతో కోహ్లి, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(PC: Twitter)

Independence Day 2022- Indian Cricketers Share Wishes: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశమంతా త్రివర్ణ శోభితమైంది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని పంద్రాగష్టు శుభాకాంక్షలతో సోషల్‌ మీడియా నిండిపోయింది. ఈ సందర్భంగా టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా భారతీయ సహోదరులకు ఇండిపెండెన్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు.

భారతీయుడినైనందుకు గర్విస్తున్నా: కోహ్లి
75 ఏళ్ల కీర్తి.. భారతీయుడినైనందుకు గర్వపడుతున్నా. అందరికీ స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్‌- ట్విటర్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.

ధావన్‌ ప్రత్యేక సందేశం
‘‘జాతికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు స్వాతంత్య్ర సమరయోధులు.. ప్రాణాలు అర్పించిన వాళ్ల త్యాగాలు నేను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటాను. కేవలం వారి కారణంగానే దేశం స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు పొందింది. వారి స్ఫూర్తితో మనమంతా దేశ ఔన్నత్యాన్ని మరింత పెంచేలా ముందడుగు వేయాలని.. అభివృద్ధి దిశగా దూసుకుపోవాలని కోరుకుంటున్నా’’- టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌

జాతీయ జెండా చేతబట్టిన కెప్టెన్‌
75 ఏళ్ల స్వాతంత్య్రం. భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు- అంటూ మువ్వన్నెల జెండాను చేతబట్టిన ఫొటోను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

అదే విధంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, భారత జట్టు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారా, టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి తదితరులు ట్విటర్‌ వేదికగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: Asia Cup 2022: కోహ్లి ఫామ్‌లోకి వస్తే అంతే సంగతులు.. పాకిస్తాన్‌కు ఆ దేశ మాజీ కెప్టెన్‌ వార్నింగ్‌!
India Tour Of Zimbabwe: స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం..! 

మరిన్ని వార్తలు