Tokyo Paralympics 2021: ఘనంగా టోక్యో పారాలింపిక్స్‌ ముగింపు వేడుకలు

5 Sep, 2021 21:58 IST|Sakshi

టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో వేదికగా జరిగిన పారాలింపిక్ క్రీడలు ముగిశాయి.12 రోజుల పాటు జరిగిన టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అద్బుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 19 పతకాలు లభించాయి. వాటిలో 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా 19 పతకాలతో పట్టికలో భారతదేశం 24 వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్‌లో భారతదేశం క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శన ఇది. పారాలింపిక్స్ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి గోల్డెన్ షూటర్ అవని లేఖార ప్రాతినిధ్యం వహించింది.త్రివర్ణ పతాకం చేతబూనిన అవని లేఖర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సాయంత్రం నిర్వహించిన ముగింపు ఉత్సవంలో బాణసంచా, రంగురంగుల విద్యుద్దీప కాంతులు, జపనీస్ కళాకారుల విన్యాసాలు, లేజర్ లైటింగ్ షో ముగింపు వేడుకల్లో ఆకట్టుకున్నాయి. 

చదవండి: Pramod Bhagath:ప్రమోద్‌ భగత్‌ నిజంగా 'బంగారం'... జీవితం అందరికి ఆదర్శం

టోక్యో నుంచి తిరిగి వస్తున్న భారత బృందాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దేశ క్రీడా చరిత్రలో టోక్యో ఒలింపిక్స్ ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ మనకు చిరకాలం గుర్తుండిపోతాయని తెలిపారు. భారత అథ్లెట్ల బృందంలోని ప్రతి ఒక్కరూ మనకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని అభినందించారు. అథ్లెట్లు, కోచ్ లు, వారి కుటుంబసభ్యులకు అందరూ మద్దతివ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు.

చదవండి: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్..

మరిన్ని వార్తలు