Women Asia Cup Final: ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్‌ విజేతగా భారత్‌

15 Oct, 2022 15:16 IST|Sakshi

మహిళల ఆసియాకప్‌-2022 విజేతగా భారత్‌ నిలిచింది. షెల్లాట్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్‌ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 7వ ఆసియాకప్‌ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

భారత బ్యాటర్లలో ఓపెనర్‌ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను పూర్తి చేసింది.  ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం  65 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో భారత పేసర్‌ రేణుకా సింగ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్‌, స్నేహ్‌ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్‌సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌లకే పరిమితమయ్యారు.
చదవండి: Rohit Sharma Press Meet: వరల్డ్‌కప్‌ కంటే అతడి కెరీర్‌ ముఖ్యం! మాకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ఎవరంటే..

మరిన్ని వార్తలు