IND-A Vs SA-A: తొలి రోజు భారత్‌పై చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా...

24 Nov, 2021 07:54 IST|Sakshi

India A bowlers toil on opening day against South Africa A: భారత్‌ ‘ఎ’తో ఆరంభమైన తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ మొదటి రోజు చెలరేగింది. ఓపెనర్‌ పీటర్‌ మలాన్‌ (258 బంతుల్లో 157 నాటౌట్‌; 18 ఫోర్లు), టోని డి జోర్జి (186 బంతుల్లో 117; 18 ఫోర్లు) శతకాలు సాధించడంతో మంగళవారం  ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమ్రాన్, అర్జాన్, సైనీ ఒక్కో వికెట్‌ తీశారు.

చదవండి: ఆటలో దూకుడు పెంచాను చతేశ్వర్‌ పుజారా వ్యాఖ్య

మరిన్ని వార్తలు