బాలీవుడ్‌ నటితో పెళ్లి.. అప్పుడే క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి!

5 Jun, 2021 11:55 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి సోషల్‌మీడియాలో ఎప్పుడు ఏదో రకంగా నిలుస్తూనే ఉంటాడు. ఎందుకోగానీ రవిశాస్త్రి విషయంలో నెటిజన్లు ట్రోలింగ్‌కు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. తాజాగా రవిశాస్త్రి టీమిండియా హెడ్‌ కోచ్‌ స్థానంలో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిన సందర్భంగా మరోసారి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారి హల్‌ చల్‌ చేస్తోంది.  కాగా ఈ విషయంపై  2018 ఇంగ‍్లండ్‌ పర్యటనలోనే రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో దర్శనమిస్తోంది.

2016లో నిమ్రత్ కౌర్‌తో కలిసి జర్మన్ బ్రాండ్ ఆడీ కారు ఓపెనింగ్‌కు రవిశాస్త్రి వెళ్లారు. ఆ తర్వాత కొన్ని పార్టీలు, పలు కార్యక్రమాలల్లో నిమ్రత్‌తో కలిసి కనిపించాడు. ఇక ఏముంది నెట్టింట వీరిద్దరు  పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే పెళ్లాడబోతున్నాడని అప్పట్లో పుకార్లు ఓ రేంజ్‌లోనే వచ్చాయి. దీంతో రవి ముంబై టాబ్లాయిడ్‌కు ఈ వియంపై ఘటుగానే జవాబిచ్చాడు. 2018 ఇంగ్లండ్ పర్యటనకు ముందు మిడ్‌ డే దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఇదంతా పెంట వ్యవహారమని, ఇలాంటి వాటిని తన ముందు ప్రస్తావించవద్దని ఘాటుగా బదులిచ్చాడు.

'ఏముంది చెప్పడానికి ఇదంతా పెంట యవ్వారం. పెంట అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చాడు. ఈ రూమర్స్‌ను నిమ్రత్ కౌర్ కూడా అప్పట్లో ఖండించింది. ఇక బాలీవుడ్ హీరోయిన్ అమృతా సింగ్‌తో ప్రేమాయణం నడిపిన రవిశాస్త్రి.. ఆ తర్వాత 1990లో రితూ సింగ్‌ను పెళ్లాడాడు. 

చదవండి: కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్.. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు