కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే

8 Dec, 2020 16:45 IST|Sakshi

సిడ్నీ : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్‌ బ్యాటింగ్‌ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో టి. నటరాజన్‌ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పటికే మాథ్యూ వేడ్‌ హాఫ్‌ సెంచరీతో ధాటిగా ఆడుతున్నాడు. ఓవర్‌లో నటరాజన్‌ వేసిన నాలుగో బంతి వేడ్‌ ప్యాడ్లను తాకింది. కానీ నటరాజన్‌.. కీపర్‌ రాహుల్‌ ఎల్బీపై అంపైర్‌కు అప్పీల్‌ చేసినా ఎటుంటి స్పందన రాలేదు... టీమిండియా కూడా రివ్యూ కోరలేదు. (చదవండి : అయ్యో! చహల్‌ ఎంత పని జరిగింది)

అయితే థర్డ్‌ అంపైర్‌ చూపించిన రిప్లైలో మాత్రం వేడ్ ఔట్‌ అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మైదానంలోని బిగ్‌స్క్రీన్‌పై వేడ్‌ ఔట్‌ అయినట్లు కనిపించడంతో షాక్‌ తిన్న కోహ్లి రివ్యూ కోరాడు. కానీ అంపైర్‌ కోహ్లి రివ్యూను తిరస్కరించారు.  సమయం మించిన తర్వాత రివ్యూ కోరావని.. అందుకే తిరస్కరించామని అంపైర్లు చెప్పడంతో కోహ్లి ఏం చేయలేకపోయాడు. ఒకవేళ కోహ్లి రివ్యూ కోరుంటే 50 పరుగుల వద్ద వేడ్‌ ఔటయ్యేవాడు. అలా బతికిపోయిన వేడ్‌ ఆ తర్వాత మరో 30 పరుగులు రాబట్టాడు.కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే ఫలితం వేరేలా ఉండేది అని అభిమానులు పేర్కొంటున్నారు. (చదవండి : స్టాండ్స్‌లోకి పంపుదామనుకుంటే స్టన్‌ అయ్యాడు..)

మరిన్ని వార్తలు