హర్మన్‌ ఆడేది... ఫైనల్‌ చేరితేనే! 

29 Jul, 2023 02:30 IST|Sakshi

నేరుగా క్వార్టర్‌ ఫైనల్లోకి భారత్‌

ఆసియా క్రీడల క్రికెట్‌ టోర్నీ ‘డ్రా’   

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగాలంటే టీమిండియా ఫైనల్‌  చేరాలి. ఎందుకంటే చైనా ఆతిథ్యమిచ్చే ఈ ఈవెంట్‌లో భారత్‌కు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ ఎంట్రీ లభించింది. కెప్టెన్‌ హర్మన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం ఉన్న నేపథ్యంలో క్వార్టర్స్, సెమీఫైనల్‌ గెలిచి భారత్‌ తుదిపోరుకు అర్హత సాధిస్తే తప్ప ఆమె ఆసియా క్రీడల ఆట ఉండదు.

చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 8 వరకు ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో మహిళల క్రికెట్‌ ఈవెంట్‌లో 14 జట్లు, పురుషుల ఈవెంట్‌లో 18 జట్లు బరిలోకి దిగుతాయి. అయితే ఈ రెండు విభాగాల్లోనూ భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు నేరుగా క్వార్టర్స్‌ ఫైనల్స్‌ ఎంట్రీ లభించింది.  

మరిన్ని వార్తలు