తండ్రిగా ప్రమోషన్‌ పొందిన టీమిండియా పేసర్‌

1 Jan, 2021 16:31 IST|Sakshi

టీమిండియా పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. ఆయన భార్య తాన్య వాద్వా శుక్రవారం రోజున ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఉమేష్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. చిన్న పాప ఫోటోను షేర్‌ చేస్తూ... ‘ఈ ప్రపంచంలోకి స్వాగతం రాకుమారి. నీ రాకతో ఎంతో థ్రిల్లింగ్‌గా ఫీల్‌ అవుతున్నాను.’ అని ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. పేస్‌ బౌలర్‌ ఉమేష్‌, తాన్య వాద్వాలా వివాహం 2013లో జరిగింది. వీరిద్దరికి ఇది మొదటి సంతానం. చదవండి: ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో నటరాజన్‌!

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ఉమేశ్‌ యాదవ్‌.. త్వరలో భారత్‌కు రానున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టెస్ట్‌లో ఉమేష్‌ యాదవ్‌ కాలికి గాయమై ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం తన ముద్దుల కూతురితో కాస్తా సమయం గడిపేందుకు అవకాశం దొరికినట్లైంది. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో ఉమేష్ యాదవ్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా వెనుదిరిగిన ఉమేష్ యాద‌వ్ స్థానంలో లెఫ్టామ్ పేస‌ర్ న‌ట‌రాజ‌న్‌కు చోటు ద‌క్కింది. ఈ విష‌యాన్ని శుక్రవారం ట్విట‌ర్ ద్వారా బీసీసీఐ వెల్ల‌డించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు