Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్‌ చేయలేరు

10 Mar, 2022 11:17 IST|Sakshi

టీమిండియాలో దిగ్గజ బ్యాట్స్‌మన్‌ ఎవరు అనగానే ముందుగా గుర్తుచ్చే పేరు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌. బ్యాట్స్‌మన్‌గా లెక్కలేనన్ని రికార్డులు సచిన్‌ సొంతం. వన్డేల్లో 49 సెంచరీలు, టెస్టుల్లో 51 సెంచరీలు కలిపి వంద సెంచరీల మార్క్‌ను అందుకొని ఎవరికి సాధ్యం కాని ఫీట్‌ సాధించాడు. 200 టెస్టులు.. 464 వన్డేలు.. ఇన్ని మ్యాచ్‌లు భవిష్యత్తులో మరే క్రికెటర్‌ ఆడకపోవచ్చు కూడా. ఈ దశలో టీమిండియాలోకి విరాట్‌ కోహ్లి అడుగుపెట్టాడు. ఆరంభం నుంచి అతని దూకుడైన ఆటతీరు చూసి సచిన్‌కు సరైన వారసుడు వచ్చాడు అన్నారు.

అందుకు తగ్గట్లే కోహ్లి వన్డేల్లో మెషిన్‌గన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే 43 సెంచరీలతో ఉన్న కోహ్లి.. మరో ఆరు సెంచరీలు చేస్తే సచిన్‌ రికార్డును అందుకుంటాడు. కనీసం ఒక్క ఫార్మాట్‌లోనైనా సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం కోహ్లికి మాత్రమే ఉంది. అయితే గత కొంతకాలంగా మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికి పాత కోహ్లిని చూపించలేకపోతున్నాడు. కోహ్లి సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. దీంతో కోహ్లి సెంచరీ చేస్తే చూడాలని ఉందంటే పలువురు ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో వందో టెస్టు ఆడిన విరాట్‌ కోహ్లిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్‌ రికార్డులను అందుకునే దమ్ము కోహ్లికి మాత్రమే ఉంది.. కోహ్లిని ఎవరు టచ్‌ చేయలేరు అంటూ పేర్కొన్నాడు. '' కోహ్లి వందో టెస్టు ఆడడం మైలురాయి అని చెప్పొచ్చు. సరైన ఫిట్‌నెస్‌ లేని ఈ కాలంలో కోహ్లి వంద టెస్టుల మార్క్‌ను అందుకోవడం గొప్ప విషయం. ఈ వంద టెస్టులు అతనికి మంచి అనుభవం నేర్పాయని అనుకుంటున్నా. మరో వంద టెస్టులు ఆడే సామర్థ్యం కోహ్లిలో ఉంది. అతని ఫిట్‌నెస్‌ ఇలాగే ఉంటే టచ్‌ చేయడం కూడా కష్టం. 33 ఏళ్ల కోహ్లి వన్డేల్లో 43 సెంచరీలు సాధించాడు. ఇంకో ఆరు సెంచరీలు బాదితే వన్డేల​ పరంగా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి కొత్త చరిత్ర సృష్టిస్తాడు. మరో మూడు నాలుగేళ్లు ఆడే సత్తా ఉన్న కోహ్లి.. తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటే మాత్రం మరో పదేళ్లు అతన్ని గ్రౌండ్‌లో చూడొచ్చు. ఒకవేళ అదే నిజమైతే ఎన్ని రికార్డులు బద్దలవుతాయనేది చెప్పడం కష్టమే'' అని తెలిపాడు.

చదవండి: Sachin Tendulkar: మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడం సంతోషం.. కానీ

విరాట్‌ కోహ్లికి పొంచి ఉన్న పెను ప్రమాదం.. మరో 43 పరుగులు చేయకపోతే..?

మరిన్ని వార్తలు